'పీఈటీ టీచర్ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తోంది - వెంటనే సస్పెండ్ చేయండి' - PET Teacher Issue in Sirisilla - PET TEACHER ISSUE IN SIRISILLA
Published : Sep 12, 2024, 1:54 PM IST
Tribal Welfare Students protest : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల కాలేజీ విద్యార్థినులు ఉదయం 4 గంటలకు రోడ్డెక్కి నిరసన చేపట్టారు. పీఈటీని సస్పెండ్ చేయాలంటూ సిరిసిల్ల - సిద్దిపేట ప్రధాన రహదారిపై విద్యార్థినులు ఆందోళన చేశారు. పీఈటీ జ్యోత్స్న తమను ఇబ్బందులకు గురి చేస్తుందని, వాటిని భరించలేక రోడ్డుపై బైఠాయించామని విద్యార్థినులు తెలిపారు. బూతులు తిడుతుందని, ఎక్కడ పడితే అక్కడ కొడుతుందని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇబ్బందులు భరించలేకనే ధర్నాకు దిగామని విద్యార్థినులు తెలిపారు. న్యాయం జరిగేంత వరకు తాము కదలబోమని రోడ్డుపై కూర్చొని పీఈటీ మేడమ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న తంగళ్లపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థినులను సముదాయించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పోలీసుల హామీతో విద్యార్థినులు శాంతించారు. తిరిగి తరగతులకు హాజరయ్యారు. పీఈటీపై త్వరలోనే చర్యలు తీసుకోకపోతే మరోసారి ఆందోళనలకు దిగుతామంటూ తెలిపారు.