తెలంగాణ

telangana

ETV Bharat / videos

సికింద్రాబాద్ క్లబ్ వద్ద కారు బీభత్సం - వీడియో వైరల్ - Car Accident In Cantonment - CAR ACCIDENT IN CANTONMENT

By ETV Bharat Telangana Team

Published : Jun 6, 2024, 1:47 PM IST

Car Accident Secunderabad Cantonment : కంటోన్మెంట్ సికింద్రాబాద్​ క్లబ్​ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కారు మూడు పల్టీలు కొట్టగా ఆ వాహనంలో ఉన్న వారు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. క్లబ్​ వద్దకు రాగానే సిగ్నల్​ పడుతుందన్న తొందరలో ఓ కారు డ్రైవర్​ అతి వేగంగా వస్తున్నాడు, అదే సమయంలో పక్క నుంచి వచ్చిన కారు సదరు వాహనాన్ని ఢీ కొట్టడంతో ఆ కారు మూడు పల్టీలు కొట్టి డివైడర్ల మీదుగా పక్కకు పడిపోయింది. ఇది అక్కడున్న సీసీటీవీల్లో రికార్డయింది. 

సమాచారం అందుకున్న ట్రాఫిక్​ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో కారులో ఉన్నవారిని బయటకు తీయగా వారంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. ఘటనా దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. వీటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ట్రాఫిక్​ నిబంధనలు పాటించాలని వాహనదారులకు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా పాటించకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. త్వరగా గమ్యానికి చేరుకోవాలనే తొందరలో వాహనదారులు ట్రాఫిక్​ రూల్స్​ బ్రేక్​ చేసి ప్రయాణించడం వల్ల ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని అంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details