LIVE : విభజన సమస్యల పరిష్కారమే అజెండాగా - తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ - Telugu States CMs Meeting LIVE - TELUGU STATES CMS MEETING LIVE
Published : Jul 6, 2024, 5:46 PM IST
|Updated : Jul 6, 2024, 6:25 PM IST
Telugu States CMs Meeting Points LIVE : తెలంగాణ ప్రజాభవన్ వేదికగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక భేటీ ప్రారంభమైంది. విభజన సమస్యల పరిష్కారానికి సమావేశం ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరగా, అందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సానుకూలంగా స్పందించి అంగీకరించారు. ఉమ్మడి ఏపీ పునర్ వ్యవస్థీకరణ జరిగి దశాబ్దకాలం గడవడంతో, హైదరాబాద్లోని ఆస్తులు, ఇతర పెండింగ్ అంశాలపై లోక్సభ ఎన్నికల ముందే చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం, గతంలోనే కేబినెట్ సమావేశం ఎజెండాలో పొందుపరిచింది. అయితే లోక్సభ ఎన్నికల పోలింగ్ వరకు ఆ అంశాలపై చర్చించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేయడంతో అప్పుడు పక్కన పెట్టింది. ఎట్టకేలకు ప్రజా భవన్లో నేటి సమావేశానికి ఏర్పాట్లతో చర్చించాల్సిన అంశాలతో ఎజెండా సిద్ధం చేసింది. విభజన అంశాలపై ప్రత్యేకంగా ముఖ్యమంత్రులు భేటీ కావడం ఇదే తొలిసారి. విభజన చట్టంలోని తొమ్మిది, పదో షెడ్యూళ్లలోని సంస్థలు, ఆస్తులపై ముఖ్యంగా చర్చ జరగనుంది.
Last Updated : Jul 6, 2024, 6:25 PM IST