తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఆంధ్రప్రదేశ్​లో కూటమి గెలుపు - తెలంగాణలో సంబురాలు చేసుకుంటున్న టీడీపీ శ్రేణులు - Tdp Leaders celebrations in TS - TDP LEADERS CELEBRATIONS IN TS

By ETV Bharat Telangana Team

Published : Jun 4, 2024, 4:24 PM IST

TDP Leaders Winning Celebrations in Telangana : ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి ముందంజలో దూసుకుపోతుండటంతో  టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకుంటున్నారు. గెలుపు దిశగా పయనిస్తోందని తెలంగాణలోని పలు జిల్లాలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా వేడుకలు చేశారు. సిద్దిపేట జిల్లా వర్గల్‌లో పూర్వ టీడీపీ కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. బాణాసంచాలు కాల్చి వేడుకలు జరిపారు. మరోవైపు మహబూబాబాద్ -ఖమ్మం జిల్లాల సరిహద్దులో తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గెలుపొందడాన్ని హర్షిస్తూ సంబురాలు చేసుకున్నారు. 

హైదరాబాద్​లోని టీడీపీ కార్యాలయం ముందు  బాణసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్​లో దోపిడి ప్రభుత్వం పోయిందంటూ నినాదాలు చేస్తున్నారు. ఏపీలో సైకో పాలన పోయి సైఖిల్​ ప్రభుత్వం వచ్చిందని టపాసులు పేల్చారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ఎదుట సీబీఎన్‌ ఫ్యాన్స్ అసోసియేషన్, స్కూల్ ఆఫ్ సీబీఎన్ కూటమి విజయంతో ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్​ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం టీడీపీ కార్యాలయానికి వెళ్లి పార్టీ నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీఆర్​ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. 

ABOUT THE AUTHOR

...view details