LIVE : తెలుగు చిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో రామోజీ రావుకి సంతాప సభ - ప్రత్యక్షప్రసారం - Ramoji Rao Condolence Meeting
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 9, 2024, 5:38 PM IST
|Updated : Jun 9, 2024, 6:24 PM IST
Tollywood Producers Ramoji Rao's condolence meeting : ఈ ఉషా కిరణాలు అంటూ సినిమా ప్రారంభానికి ముందు వచ్చే ఆ గీతాన్ని వినని తెలుగువాడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ ద్వారా ఎంతోమంది నటులు, దర్శకులు, టెక్నీషియన్లను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. అంతేకాదు మయూరి ఫిలిం డిస్టిబ్యూటర్స్ను ప్రారంభించి కొన్ని వందల తెలుగు చిత్రాలనే కాకుండా, ఇతర భాషా చిత్రాలు కూడా పంపిణీ చేస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో దేశంలోని అన్ని భాషా చిత్రాలను షూట్ చేస్తుంటారు. బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అన్న తేడా లేకుండా అందరూ రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చి షూట్ చేసుకుని వెళ్తుంటారు. సినీ పరిశ్రమకు ఆయన ఎనలేని సేవ చేశారు. ఆ మహానీయుడు మరణం సినీ లోకానికి తీరని లోటు. అందువల్ల చిత్ర పరిశ్రమ దర్శకులు, నిర్మాతలు ఆయన మరణానికి సంతాపంగా ఇవాళ షూటింగ్‌ను నిలిపివేశారు. హైదరాబాద్‌లో సంతాప సభను ఏర్పాటు చేసి సినీ రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు.
Last Updated : Jun 9, 2024, 6:24 PM IST