LIVE: పవన్ కల్యాణ్ మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 29, 2024, 3:24 PM IST
|Updated : Nov 29, 2024, 3:56 PM IST
PAWAN KALYAN LIVE: రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీలు చేపట్టారు. ఎగుమతికి సిద్ధంగా ఉంచిన రేషన్ బియ్యాన్ని పవన్ కల్యాణ్ పరిశీలించారు. పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ పోర్టు నిర్వాహకుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. బియ్యం స్మగ్లింగ్ చేస్తుంటే ఏం చేస్తున్నారంటూ డీఎస్పీ రఘువీర్ విష్ణువు, ఎమ్మెల్యే కొండబాబుని పవన్ కల్యాణ్ నిలదీశారు. కాకినాడ పోర్టులో 1064 టన్నుల బియ్యం సంచులను పవన్‌కల్యాణ్, మంత్రి నాదెండ్ల పరిశీలించారు. 2 రోజుల క్రితం కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టగా, స్టెల్లా ఎల్ పనామా షిప్‌లో 640 టన్నుల రేషన్ బియ్యం పట్టుబడిన విషయం తెలిసిందే. తాజాగా బియ్యం సంచులను స్వయంగా వెళ్లి పవన్ కల్యాణ్ తనిఖీలు చేపట్టారు. భారీగా బియ్యం రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారని అధికారులపై పవన్ మండిపడ్డారు. ప్రజాప్రతినిధులు వచ్చి బియ్యం అక్రమ రవాణా ఆపితేగాని మీరు ఆపలేరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బియ్యం అక్రమ రవాణాలో ఎవరు ఉన్నా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రేషన్ బియ్యం ఇష్టానుసారం తరలిస్తున్నవారు ఎంతవారైనా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం
Last Updated : Nov 29, 2024, 3:56 PM IST