LIVE : బియ్యం అక్రమ రవాణా వ్యవహారం- మంత్రి నాదెండ్ల మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - MINISTER NADENDLA LIVE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 1, 2024, 12:08 PM IST
|Updated : Dec 1, 2024, 12:35 PM IST
Minister Nadendla Live : కాకినాడ పోర్టు కేంద్రంగా రేషన్ బియ్యం దందా మూడు పువ్వులు, ఆరు కాయల చందంగా సాగిపోతోంది. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సామ్రాజ్యానికి ఎదురే లేదనేలా పరిస్థితి ఉంది. పట్టుబడిన నిల్వలకు బ్యాంకు గ్యారంటీలు చూపి, బయటకు తెచ్చి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. 6ఏ కేసులకు మించి మమ్మల్నేం చేయగలరు? అంటూ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు. వైఎస్సార్సీపీ నేతతో అప్పట్లో అంటకాగిన అధికారులే నేటికీ కీలక శాఖల్లో ఉంటూ సహకరిస్తుండటమూ బియ్యం అక్రమ రవాణాకు ఊతమిస్తోంది. రాష్ట్రంలో ఏటా 25.59 లక్షల టన్నుల బియ్యాన్ని పేదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నాయి. దీనికి సుమారు రూ.11,000ల కోట్ల వ్యయం చేస్తున్నాయి. కిలో బియ్యానికి రూ.43 చొప్పున ఖర్చవుతుంటే రేషన్ మాఫియా వాటిని కిలో రూ.11 చొప్పున కార్డుదారుల నుంచి కొనుగోలు చేసి మిల్లులకు అక్కడ నుంచి విదేశాలకు తరలిస్తోంది. మొత్తం పంపిణీ చేసే రేషన్ బియ్యంలో 80శాతం నల్లబజారుకు తరలిస్తున్నట్లు అంచనా. ఇందులో 60 శాతం పైగా కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాలకు అక్రమ రవాణా అవుతోంది. కాకినాడ పోర్టు నుంచి పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారంపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు.
Last Updated : Dec 1, 2024, 12:35 PM IST