CM Chandrababu Mydukur Tour : స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించింది. వైఎస్సార్ జిల్లా మైదుకూరులో సీఎం చంద్రబాబు లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం పారిశుద్ధ కార్మికులతోనూ ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించనున్నారు. ఇకపై ప్రతినెల మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించనున్నారు.
విజయవాడ నుంచి కడప విమానాశ్రయానికి అక్కడి నుంచి హెలికాప్టర్‌లో చంద్రబాబు మైదుకూరు చేరుకోనున్నారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి అక్కడి నుంచి బయల్దేరి వినాయక్‌నగర్‌లోని మున్సిపల్ కార్మికుడి ఇంటికి వెళ్లి చెత్త సేకరణ వివరాలు గురించి అడిగి తెలుసుకోనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు నేషనల్ గ్రీన్ కాప్స్‌తో కలిసి జిల్లా పరిషత్ హైస్కూల్ వరకు సీఎం ర్యాలీగా వెళ్తారు.
హైస్కూల్లో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలిస్తారు. స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించనున్నారు. ప్రతినెల మూడో శనివారం ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఒక్కో నెల ఒక్కో థీమ్‌తో ఏడాదికి 12 అంశాలపై ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. సీఎం పర్యటన ఉదయం నుంచి సాయంత్రం వరకు మైదుకూరులోనే ఉన్న సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. దాదాపు 1500 పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా జిల్లాలో నెలకొన్న పార్టీ పరిస్థితిపై కూడా ఆయన మైదుకూరులో సమీక్ష నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. పర్యటన అనంతరం చంద్రబాబు విజయవాడ వెళ్లనున్నారు.
Swachh Andhra Swachh Divas in AP : మరోవైపు స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సీఎం మంత్రివర్గ సమావేశంలోనూ దీనిపై ఘాటుగా హెచ్చరించారు. కేవలం ఫొటోలు ఫోజులిస్తే సరిపోదని మంత్రులంతా చురుగ్గా పాల్గొనాలని తెలిపారు. పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని వారికి సూచించారు.
'ఫొటోలకు ఫోజులు కాదు - ఫలితాలు కావాలి' - మంత్రులు, ఎంపీలకు చంద్రబాబు క్లాస్
7 నెలల్లో 4 లక్షల కోట్ల పెట్టుబడులు - ఇకపై అన్నీ మంచి రోజులే: చంద్రబాబు