Amaravati construction work to begin from March 15th: అమరావతి నిర్మాణ పనులు మార్చి 15 నుంచి ప్రారంభం కానున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఎన్నికల కమిషన్ ఆదేశాలతో టెండర్లు ఖరారు ఆలస్యమైంది. టెండర్లు పిలిచినా ఖరారు చేయవద్దని ఈసీ ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటి వరకూ సీఆర్డీఎ, అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ 62 పనులకు టెండర్లు పిలిచింది. సుమారు రూ.40 వేల కోట్ల విలువైన పనులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతుంది. మరో 11 పనులకు త్వరలో టెండర్లు పిలవనున్నారు. ఏప్రిల్ మొదటి వారం నుంచి అమరావతిలో 30 వేల మంది కార్మికులు పనులు చేస్తారని సీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు.
ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాకే టెండర్లు ఖరారు: అమరావతిలో నిర్మాణ పనులకు సంబంధించి టెండర్లు పిలిచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కొద్ది రోజుల క్రితం అనుమతిచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో సీఆర్‌డీఏ పరిధిలో చేపట్టబోయే పనులకు అనుమతి కోసం ఇటీవల సీఆర్‌డీఏ అధికారులు ఈసీకి లేఖ రాశారు. దీనిపై స్పందించిన ఈసీ రాజధానిలో పనులకు అభ్యంతరం లేదని లేఖ ద్వారా స్పష్టం చేసింది. టెండర్లు పిలిచేందుకు అనుమతించింది. అయితే, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక మాత్రమే టెండర్లు ఖరారు చేయాలని లేఖలో పేర్కొంది.
రూ.2,514 కోట్ల అంచనాలతో టెండర్లు: ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు రుణం మంజూరు చేయటంతో అమరావతిలో పనుల్ని పరుగెత్తించేందుకు సీఆర్డీఏ, అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్లు వరుస గతంలో టెండర్లను జారీ చేసింది. అయితే ఈ రెండు సంస్థలు కలిపి రూ.2,514 కోట్ల అంచనాలతో టెండర్లను పిలిచాయి. రాజధానిలో రోడ్ల నిర్మాణం లాంటి ట్రంక్ ఇన్ ఫ్రాతో పాటు, భూగర్బ విద్యుత్ కేబుళ్ల కోసం యుటిలీటీ డక్ట్లు, వరదనీటి కాలువలు, సీవరేజి, అవెన్యూ ప్లాంటేషన్, మిగిలిన పనులు చేపట్టేందుకు ఈ టెండర్లను జారీ చేశారు. గతంలో నిర్మించిన గెజిటెడ్ అధికారుల అపార్టమెంట్లు, టైప్ 1, 2, క్లాస్ 4 ఉద్యోగుల ఆపార్టుమెంట్లలో మిగిలిపోయిన పనులు చేపట్టేందుకు కూడా సీఆర్డీఏ టెండర్లను ఆహ్వానించింది
రైతులకు అలర్ట్ - ప్రభుత్వ పథకాలు రావాలంటే ఈ నంబర్ తప్పనిసరి, వెంటనే నమోదు చేసుకోండి