ETV Bharat / health

ట్రెండింగ్​లో పసుపు కాఫీ - ఎలా తయారు చేయాలో మీకు తెలుసా?

- రుచితోపాటు ఆరోగ్యానికీ మేలు జరుగుతుందంటున్న నిపుణులు

Turmeric Coffee Recipe
Turmeric Coffee Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 3 hours ago

Turmeric Coffee Recipe : "కాఫీ.." దీన్ని ప్రేమించే వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డైలీ మార్నింగ్​, ఈవెనింగ్​ టైమ్​లో చాలా మందికి స్ట్రాంగ్​ కాఫీ ఉండాల్సిందే. పని ఒత్తిడితో బుర్ర హీటెక్కిపోతే మధ్యాహ్నం కూడా కాఫీ పడాల్సిందే. ఇలాంటి కాఫీలో ఎన్నో రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి. అంతలా కాఫీ మన లైఫ్​లో ఒక భాగమైపోయింది.

అయితే.. ఇప్పుడు మరో రకం కాఫీ ట్రెండింగ్​లో ఉంది. తనదైన టేస్ట్​తో జనాలను ఆకర్షిస్తోంది. అదే "పసుపు కాఫీ". దీన్నే 'గోల్డెన్‌ మిల్క్‌ లాటే' అని కూడా పిలుస్తారు. ఈ రోజుల్లో జనాలకు ఆరోగ్య స్పృహ చాలా పెరిగింది. ఇలాంటి వాళ్లంతా ఆరోగ్యానికి మంచిదని పసుపు కాఫీని సిప్ చేస్తున్నారు. మరి, ఈ టర్మరిక్​ కాఫీతో ఎలాంటి లాభాలు ఉన్నాయి? నిపుణులు ఏం చెబుతున్నారు? దీన్ని ఎలా తయారు చేయాలి ? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

లాభాలు..

  • పసుపులోని కుర్‌క్యుమిన్‌తోపాటు యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, రోగనిరోధకతను పెంచే లక్షణాలు అధికంగా ఉంటాయి.
  • ఇది కాఫీతో కలిసినప్పుడు టేస్ట్​ పెరగడమే కాదు.. బోలెడు ఆరోగ్యప్రయోజనాలనూ అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
  • దీంతో ప్రస్తుతం ఈ పసుపు కాఫీకి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. ఈ కాఫీ ఒంట్లో చురుకుదనం పెంచడంతోపాటు బాడీలోని ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది.
  • ఆర్థరైటిస్, కండరాల నొప్పుల నుంచి మంచి ఉపశమనం కలిగిస్తుంది. కాఫీ, పసుపు రెండింట్లోనూ యాంటీఆక్సిడెంట్లు అధికం. ఇవి కలిసి కణాలను రిపేర్‌ చేసి, వృద్ధాప్యఛాయలు త్వరగా రాకుండా అడ్డుకుంటాయి.
  • యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్‌ లక్షణాలు చలికాలంలో వచ్చే జలుబు, ఇతర ఇన్‌ఫెక్షన్లకు చెక్‌ పెడతాయి.
  • సాధారణంగా కాఫీలోని ఎసిడిక్‌ లక్షణాలు గ్యాస్‌కి కారణమవుతాయి. కానీ.. పసుపుతో చేసిన ఈ కాఫీ కడుపుబ్బరం, అజీర్తి వంటివి తొలగించడమే కాదు.. జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్నీ కాపాడుతుంది.
  • మెదడు, గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఇన్ని ప్రయోజనాలున్న టర్మరిక్​ కాఫీని ఎలా చేయాలంటే..

  • ముందుగా నచ్చిన ఫ్లేవర్‌ కాఫీకి అరచెంచా పసుపు, చిటికెడు మిరియాల పొడి, పావు చెంచా దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలపాలి.
  • అంతే.. అద్దిరిపోయే టేస్టీ అండ్​ హెల్దీ టర్మరిక్​ కాఫీ రెడీ!
  • ఈ కాఫీ తాగిన వారికి సరికొత్త రుచిని పరిచయం చేయడంతోపాటు ఆరోగ్యాన్ని అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరి, మీకు కూడా నచ్చితే ఓసారి ట్రై చేయండి.

ఇవి కూడా చదవండి :

కాఫీ తాగడం కాదు - ఒంటికి పూసుకోండి - అందంగా మెరిసిపోండి!

'షుగర్​'ను కంట్రోల్ చేసే 'గ్రీన్ కాఫీ' - ఇలా తాగితే బరువు కూడా తగ్గొచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.