LIVE : సచివాలయం 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ప్రత్యక్ష ప్రసారం - CONSTITUTION DAY CELEBRATIONS
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-11-2024/640-480-22980639-thumbnail-16x9-constitution-day-celebrations-at-ap-secretariat-live.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 26, 2024, 12:06 PM IST
|Updated : Nov 26, 2024, 12:34 PM IST
Constitution Day Celebrations at AP Secretariat Live : 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఇవాళ్టికి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏపీ సచివాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ అన్ని శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లందరికీ ఆదేశాలు జారీ చేశారు. వేడుకల్లో భాగంగా రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న అందరితో రాజ్యంగా పీఠికను చదివించాలని ముందుగానే నిర్దేశించారు. సచివాలయం 5వ భవనంలో ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ప్రారంభమైన వేడుకల్లో సీఎం చంద్రబాబు సహా మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ప్రస్తుతం మీకోసం రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ప్రత్యక్ష ప్రసారం.
Last Updated : Nov 26, 2024, 12:34 PM IST