ISRO and NASA Joint Mission: మన దేశానికి చెందిన ఇస్రో, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కలిసి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గగనయాన్ మిషన్‌కు సంబంధించిన మొదటి దశ అయిన ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ పూర్తయింది. ఈ మేరకు దీనికి సంబంధించిన సమాచారాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) అధికారికంగా ప్రకటించింది.
మానవ సహిత రోదసియాత్రకు ఎంపికైన వ్యోమగాములు.. ప్రైమరీ క్రూ మెంబర్ గ్రూప్ కెప్టెన్ సుభాన్షు శుక్లా, బ్యాకప్ క్రూ మెంబర్ గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ తమ ప్రాథమిక శిక్షణను అమెరికాలో పూర్తి చేసుకున్నట్లు ఇస్రో తెలిపింది. ఈ గగనయాన్ మిషన్‌ను 2026 చివరిలో ప్రయోగించేందుకు షెడ్యూల్ చేశారు. అన్నీ అనుకున్నట్లుగానే జరిగి ఈ మిషన్ పూర్తయితే.. ఇది ఇండియా మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర అవుతుంది.
ఆస్ట్రోనాట్స్ ట్రైనింగ్: గగనయాన్ మిషన్‌కు సంబంధించి వ్యోమగాముల ట్రైనింగ్ ఆగస్టులో ప్రారంభమైంది. ఈ మిషన్ కోసం ఎంపికైన ఆస్ట్రోనాట్స్‌కు తగిన విధంగా శిక్షణను అందించి సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో ట్రైనింగ్‌లో భాగంగా మొదటి దశను వ్యోమగాములు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్నట్లు ఇస్రో తెలిపింది. అంతేకాక వారికి ISS ( ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్) వ్యవస్థలను కూడా పరిచయం చేసినట్లు ఇస్రో తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో ఒక పోస్ట్‌లో పేర్కొంది.
అయితే ఐఎస్‌ఎస్, గగన్‌యాన్ రెండూ వేర్వేరు రకాల అంతరిక్ష యాత్రలు. గగన్‌యాన్ యాత్ర కోసం ఐఎస్‌ఎస్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. కాకపోతే అంతరిక్ష యాత్రకు సంబంధించి ఐఎస్‌ఎస్ వాస్తవిక అనుభవాలు గగన్‌యాన్‌కూ ఉపయోగపడొచ్చని ఇస్రో భావిస్తుండొచ్చు.
తదుపరి శిక్షణ దశపై దృష్టి: ఇప్పుడు వ్యోమగాములు తమ తదుపరి శిక్షణపై దృష్టి సారించనున్నట్లు ఇస్రో తెలిపింది. తర్వాతి దశలో ఐఎస్‌ఎస్ U.S. ఆర్బిటాల్ సెగ్మెంట్ కోసం ప్రాక్టికల్ మాడ్యూల్ ఉంటాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో వారు మైక్రోగ్రావిటీలో సైంటిఫిక్ రీసెర్చ్ ఎక్స్‌పెర్‌మెంట్స్, స్పేస్‌ఎక్స్ డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ కార్యాచరణ శిక్షణపై కూడా ఫోకస్ చేయనున్నట్లు ఇస్రో పేర్కొంది.
🚀 Gaganyaan on a Global Stage 🌏
— ISRO (@isro) November 29, 2024
The initial phase of training for Gaganyatris, part of the historic ISRO-NASA joint mission to the International Space Station, has been successfully completed.
Prime Crew: Group Captain Shubhanshu Shukla
Backup Crew: Group Captain Prasanth…
మానవ సహిత అంతరిక్ష ప్రయోగాల కోసం ఇస్రో చేస్తున్న ప్రయత్నాల్లో ఈ గగన్‌యాన్ మిషన్ కీలక అడుగు అని చెప్పొచ్చు. ఇస్రో, నాసా పరస్పర సహకారంతో దీన్ని ప్రయోగించనున్నారు. ఈ గగన్‌యాన్ మిషన్ సక్సెస్ కోసం వ్యామగాములు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు ఇస్రో పేర్కొంది.
2025లో మొదటి సూర్యగ్రహణం ఎప్పుడో తెలుసా?- ఇది ఏ రాశులపై ప్రభావం చూపిస్తుందంటే..?
భారత్ అణుబాంబు మిస్సైల్ టెస్ట్ సక్సెస్- భూమి, ఆకాశంలోనే కాదు.. సముద్రం నుంచి కూడా సై..!