ETV Bharat / state

విద్యార్థులకు సబ్జెక్టుకు బదులు బైబిల్! - SVU ప్రొఫెసర్ అన్యమత ప్రచారంపై బజరంగ్​దళ్ ఆందోళన

ఎస్వీయూలో ఆలస్యంగా వెలుగుచూసిన అన్యమత ప్రచారం - ప్రొఫెసర్‌ చెంగయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌

svu_proffecer_bible
svu_proffecer_bible (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 18 hours ago

Religious Propaganda at Sri Venkateswara University : తిరుపతిలో శ్రీవారి పాదాల చెంత విద్యార్థులకు పాఠాలు చెప్పి విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ప్రొఫెసర్ ఏకంగా బైబిల్ చేత బట్టి అన్యమత ప్రచారం నిర్వహించడం కలకలం రేపింది. అంతేగాక తమ మతంలో చేరాల్సిందిగా విద్యార్థులను ఆహ్వానించడం దుమారం రేపింది. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీయూ)లో అన్యమత ప్రచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బైబిల్​ బోధన : ఎస్వీయూ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన ఘటనపై భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న ఈఈఈ డిపార్ట్​మెంట్‍ ప్రొఫెసర్ చంగయ్య విద్యార్ధులకు అన్యమత ప్రచార బోధన చేస్తున్నారంటూ బజరంగ్‍ దళ్‍ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి రోజు నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులకు సబ్జెక్టుకు బదులుగా బైబిల్​ని బోధిస్తూ, హిందూ దేవుళ్లను కించపరుస్తూ మానసికంగా వేధిస్తున్నాడని ఆరోపించారు.

తిరుమలలో అన్యమత ప్రచారం జరిగితే కఠిన చర్యలు: టీటీడీ ఛైర్మన్​ బీఆర్ నాయుడు

విధుల నుంచి తప్పించాలని డిమాండ్ : ప్రొఫెసర్ చంగయ్య కార్యాలయంలో ఇతర మతాలకు సంబంధించిన ఫొటోలు, సాహిత్యం బజరంగ్‌దళ్‌ నాయకులు గుర్తించి వర్సిటీ రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్లారు. చంగయ్యపై చర్యలు తీసుకోవాలని వైస్‌ ఛాన్సలర్‌కి వినతిపత్రం అందజేశారు. విద్యార్ధులకు అన్యమత ప్రచార బోధన చేస్తున్న ఆడియో క్లిప్పింగ్​లు బయటకు వచ్చాయని తెలిపారు. అన్యమత ప్రచారంపై వైస్‌ ఛాన్సలర్‌ అలసత్వం వహిస్తున్నారని ఆరోపించారు. ప్రొఫెసర్​ను వెంటనే విధుల నుంచి తప్పించాలని డిమాండ్​ చేశారు.

కమిటీ వేసి చర్యలు తీసుకుంటాం : భజరంగ్‍ దళ్‍ నాయకులు ప్రొఫెసర్​ని అన్యమత ప్రచారంపై అడగ్గా స్వల్ప వివాదం చోటు చేసుకుంది. సదరు ఆచార్యున్ని గట్టిగా మందలించారు. చంగయ్య కారుపై రాళ్ల దాడి చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని బజరంగ్‍ దళ్‍ నాయకులను బయటకు పంపించి పరిస్థితిని అదుపు చేశారు. మత ప్రచారంపై ఓ అధ్యాపకురాలు రెండు రోజుల కిందట వర్సిటీ అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య శ్రీనివాసరావును సంప్రదించగా ఆచార్యులతో కమిటీ వేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

రిజర్వేషన్ కోసం మతమార్పిడిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు- 'అలా చేయడం రాజ్యాంగాన్ని మోసగించడమే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.