సౌత్ కొరియాలోని డిమిలిటరైజేషన్ జోన్‌ను సందర్శించిన తెలంగాణ టీమ్
Published : Oct 23, 2024, 2:51 PM IST
Demilitarization Zone in South Korea: ఉత్తర, దక్షిణ కొరియా సరిహద్దు ప్రాంతమైన డీ మిలిటరైజేషన్ జోన్‌ను రాష్ట్ర బృందం పర్యటించింది. దక్షిణకొరియాలో మూడో రోజు తెలంగాణ ప్రతినిధుల బృందం పర్యటన ఉత్తర, దక్షిణ కొరియా సరిహద్దు ప్రాంతమైన డీమిలిటరైజేషన్ జోన్(డీఎంజే) వద్ద పర్యటన కొనసాగుతోంది. ప్రపంచంలో అత్యంత ఎక్కువ సైన్యం మోహరించిన సరిహద్దు ప్రాంతాల్లో డీఎంజే ఒకటి. దీని సందర్శనకు ఏటా లక్షల్లో పర్యాటకులు వస్తుంటారు. సుమారు 250 కిలోమీటర్ల మేర ఉన్న డీమిలిటరైజేషన్ జోన్ ఇది.
దీనిలో మూడు టన్నెల్స్ ఉన్నాయి. ఉత్తర కొరియా, దక్షిణ కొరియా సరిహద్దుకు దగ్గరగా నెం 3వ టన్నెల్ నిర్మాణం జరిగింది. ఈ టన్నెల్లోకి వెళ్లాలంటే చాలా కఠిన నిబంధనలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. శ్వాసకోస, గుండె సంబంధిత వ్యాధులు ఉంటే టన్నెల్ నుంచి బయటకు రావడం చాలా కష్టంగా ఉంటుందని అక్కడి నిర్వాహకులు చెబుతున్నారు. అక్కడ సౌత్ కొరియా, నార్త్ కొరియాలకు రెండింటికి తీవ్ర శత్రుత్వం ఉంది. భారతదేశం, పాకిస్థాన్‌లకు మధ్య ఎలాగైతే తీవ్రమైన వివాదాలు తలెత్తుతాయో అక్కడ కూడా పరిస్థితి అలాగే ఉంటుంది.