ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన జిష్ణు దేవ్ వర్మ - TG New Governor Oath Ceremony

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 31, 2024, 7:09 PM IST

TG NEW GOVERNOR OATH CEREMONY (ETV Bharat)

Telangana New Governor Jishnu Dev Oath Ceremony: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం నాలుగో గవర్నర్​గా జిష్ణు దేవ్​ వర్మ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు రాజ్​ భవన్​లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ అలోక్​ అరాధే కొత్త గవర్నర్​ తో ప్రమాణం స్వీకారం చేయించారు. ఈ వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్​ రెడ్డి, రాష్ట్ర మంత్రుల బృందం, సీఎస్‌ శాంతి కుమారి, కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి సహా అధికార, విపక్ష నాయకులు హాజరయ్యారు.

1957 ఆగస్టు 15న జన్మించిన జిష్ణుదేవ్‌ వర్మ, త్రిపుర రెండో డిప్యూటీ సీఎంగా 2018 నుంచి 2023 వరకు పని చేశారు. బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడిగానూ గతంలో సేవలందించారు. ఆయన త్రిపుర రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి. రామ జన్మభూమి ఉద్యమ సమయంలో 1990లో భారతీయ జనతా పార్టీలో చేరారు. తెలంగాణ బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్‌గా నియమితులు కాగా, ఆ రాష్ట్రానికి చెందిన నాయకుడు తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా రావడం విశేషం.

ABOUT THE AUTHOR

...view details