Uncle Murdered his Nephew in Chodavaram : అనకాపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మేనల్లుడుని మామ కొట్టి చంపండం స్థానికంగా కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళితే జిల్లాలోని చోడవరం పాత బస్టాండ్ వద్ద మేనల్లుడు ప్రేమ్‌కుమార్‌ను మామ బంగారుదుర్గ హత్య చేశాడు. హత్య చేసిన అనంతరం బంగారుదుర్గ పోలీసులకు లొంగిపోయాడు. మామ అల్లుడు మద్యం తాగారని, అనంతరం ఇద్దరూ గొడవ పడినట్లు స్థానికులు చెప్పారు. ఆ తగాదాలో బంగారుదుర్గ ప్రేమ్‌కుమార్‌ను కొట్టి చంపాడని తెలిపారు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడని వారు వెల్లడించారు.
పారిపోయిన ప్రేమజంట - పెళ్లి చేస్తామని ఇంటికి పిలిపించాక ఏమైందంటే!
భయపెట్టి ఆస్తి కొట్టేయాలని - డెడ్‌బాడీ పార్శిల్ కేసు ఛేదించిన పోలీసులు