ETV Bharat / state

బాబోయ్​ - ఈ పాలు తాగితే ప్రాణాలు పోవడమే ! - MILK ADULTERATION IN ANANTAPUR

అనంతపురం జిల్లావ్యాప్తంగా పాలలో పెద్దఎత్తున కల్తీ - తయారుచేస్తున్న ఇంటిపై దాడి చేసి పట్టుకున్న విజిలెన్సు అధికారుల బృందం

Milk_adulteration_in_Anantapur
Milk_adulteration_in_Anantapur (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 4, 2025, 9:30 PM IST

Updated : Feb 4, 2025, 10:22 PM IST

Vigilance Raids on Milk Adulteration House: అనంతపురం జిల్లావ్యాప్తంగా పాలలో పెద్దఎత్తున కల్తీ జరుగుతోంది. రాప్తాడు మండలం బండమీదపల్లిలో రసాయనాలతో పాలు తయారుచేస్తున్న ఇంటిపై విజిలెన్సు అధికారుల బృందం దాడి చేసి పట్టుకున్నారు. అత్యంత ప్రమాదకరమైన మాల్తోడెక్స్ ట్రిన్ పౌడర్, ఉప్పు, పామాయిల్​లను గ్రైండింగ్ చేసి పాలను తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. రైతుల నుంచి రోజూ 700 లీటర్ల పాలను సేకరించి, ఈ పాలలో రసాయన పాలను కల్తీచేసి చిక్కదనంగా మార్చి పాల డెయిరీలకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది.

అనంతపురం నగరంలో రోడ్డు సైడు పాలు విక్రయం చేసే వ్యాపారులు 90 శాతం మంది వరకు మాల్తోడెక్స్ ట్రిన్ రసాయన పౌడర్​తోనే పాలు తయారు చేసి కల్తీ చేస్తున్నట్లుగా విజిలెన్సు అధికారుల విచారణలో స్పష్టమైంది. కల్తీ పాలు తయారు చేస్తున్న వ్యక్తిని దాడిచేసి పట్టుకున్నట్లు విజిలెన్సు డీఎస్పీ వెల్లడించారు. ఈ క్రమంలో విజిలెన్స్‌ డీఎస్పీ నాగభూషణం మాట్లాడుతూ అనంతపురం జిల్లావ్యాప్తంగా గత కొన్ని సంవత్సరాలు కల్తీ పాల తయారీ యథేచ్ఛగా జరుగుతుందని తెలిపారు. దీనిపై తమకు కొన్ని రోజుల క్రితం ఫిర్యాదులు వచ్చాయని ఈ క్రమంలో వారు దీనిపై ఎక్కడ జరుగుతుంది ఎలా జరుగుతుంది అని విచారించినట్లు వెల్లడించారు.

ఏపీలోనూ గజదొంగ ప్రభాకర్ చోరీలు​ - ఇంజినీరింగ్​ కాలేజీలే టార్గెట్​

ఈ నేపథ్యంలో బండమీదపల్లి అనే గ్రామంలో మూడు నాలుగు చోట్ల ఈ కల్తీ పాల తయారీ జరుగుతుందని విజిలెన్స్‌ డీఎస్పీ అన్నారు. మూందుగా రామిరెడ్డి అనే వ్యక్తి ఇంటికి తనిఖీకి వెళ్లగా అదే సమయంలో అతను కల్తీ పాలను తయారుచేస్తున్నాడని అన్నారు. కొన్ని రకాల కెమికల్స్​తో ఈ వాళ్లు ఈ పాలను తయారు చేస్తున్నారని వెల్లడించారు. వీరు ఇలా తయారు చేసిన కల్తీ పాలను వ్యక్తులకు అమ్మకుండా నేరుగా పాల డైరీలకు అమ్ముతున్నారని తెలిపారు. ఈ కల్తీ పాలు తాగడం వల్ల చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారని అంతే కాకుండా డయాబెటీస్ ఉన్న వారు ఈ పాలను తాగితే వారి ఆరోగ్యం మరింతగా దెబ్బ తింటుందని విజిలెన్స్‌ డీఎస్పీ తెలిపారు.

బాబోయ్​ - ఈ పాలు తాగితే ప్రాణాలు పోవడమే ! (ETV Bharat)

జిల్లావ్యాప్తంగా గత నాలుగు సంవత్సరాలు కల్తీ పాల తయారీ యదేచ్ఛగా జరుగుతుంది. దీనిపై మాకు కొన్ని రోజుల క్రితం ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో మేము దీనిపై ఎక్కడ జరుగుతుంది ఎలా జరుగుతుంది అని విచారించాము. ఈ నేపథ్యంలో బండమీదపల్లి అనే గ్రామంలో మూడు నాలుగు చోట్ల ఈ కల్తీ పాల తయారీ జరుగుతుంది. మూందుగా రామిరెడ్డి అనే వ్యక్తి ఇంటికి తనిఖీకి వెళ్లగా అదే సమయంలో అతను కల్తీ పాలను తయారుచేస్తున్నాడు. కొన్ని రకాల కెమికల్స్​తో ఈ వాళ్లు ఈ పాలను తయారు చేస్తున్నారు.- నాగభూషణం, విజిలెన్స్‌ డీఎస్పీ

వందకు పైగా మహిళల వీడియోలు - మరోసారి కస్టడీకి మస్తాన్‌సాయి!

'ప్రభుత్వ పథకాలపై నిరంతరం అభిప్రాయ సేకరణ జరపాలి'

Last Updated : Feb 4, 2025, 10:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.