Huge Tourists To Araku Tribal Exhibition Hall : అరకు గిరిజన ప్రదర్శనశాల పర్యాటకులతో సందడిగా మారింది. గిరిజనుల జీవన విధానాలు, సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా మైనపు బొమ్మలతో ఏర్పాటు చేసిన కళాకృతులు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కంప్యూటర్లు, స్మార్ట్ పోన్లతో గజిబిజి జీవితాలు గడుపుతున్న యువత కాస్త తీరిక తీసుకొని ట్రైబల్ మ్యూజియాన్ని సందర్శిస్తున్నారు. మన పూర్వీకుల జీవన విధానం, ఆహారపు అలవాట్లు వంటివి తెలుసుకొని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం ఈ టీవీ భారత్ ప్రతినిధి మహేశ్ అందిస్తారు.
'నేను మా పిల్లలతో పాటు ఇక్కడకు వచ్చాను. అరకు గిరిజన ప్రదర్శనశాలలో గిరిజనుల జీవన విధానాన్ని కళ్లకు కట్టేలా చూపించారు. మా పిల్లలు చాలా ఆనందపడ్డారు. ఈ తరం యువత ఈ మ్యూజియం చూడటం ద్వారా చాలా విషయాలు తెలుసుకోవచ్చు. అప్పట్లో ఆహారపు అలవాట్లు ఏంటి, వాళ్లు దాన్నెలా సేకరించేవారు అనే విషయాల్లో అవగాహన కలగడంతో పాటు, రెడిమేడ్, ప్రాసెస్డ్ ఫుడ్ తినే ఈ తరం వారికి కనువిప్పు కలిగే అవకాశం ఉంది.' - పర్యాటకులు
అరకులో ప్రారంభమైన వింటర్ ఫెస్ట్ - ప్రత్యేక ఆకర్షణగా పారా గ్లైడింగ్
అంబరాన్నంటిన అరకులోయ చలి ఉత్సవాలు - మొదట రోజు గ్రాండ్ సక్సెస్