Prajavedika Program at TDP Central Office in Mangalagiri: వినాయకస్వామి ఆలయం పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసిన విజయసాయిరెడ్డి అనుచరుడు నిరంజన్ భక్తుల దగ్గరి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడని, అంతేకాకుండా ఆలయం చుట్టూ ఉన్న భూముల్ని కబ్జా చేశాడని చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన పలువురు వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ టీడీపీ నేతలకు ఫిర్యాదు చేశారు.
పరిష్కారం దిశగా చర్యలు: గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో టీడీపీ నేతలు ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. పలు సమస్యలతో పెద్ద సంఖ్యలో తరలివచ్చిన బాధితుల నుంచి గిరిజన సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి, రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం దిశగా చర్యలు తీసుకున్నారు. సంబంధిత శాఖలకు ఫోన్లు చేసి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.
'తహసీల్దార్ లంచం తీసుకొని భూరికార్డుల్ని మార్చేశారు - న్యాయం చేయండి'
నెలలు గడుస్తున్నా పరిహారం అందలేదు: 30 ఏళ్లుగా తన అధీనంలో ఉన్న భూమిని కబ్జా చేయాలని వైఎస్సార్సీపీ నేతలు కుట్ర చేస్తున్నారని అంతేకాకుండా అర్ధరాత్రి వచ్చి పంట ధ్వంసం చేస్తున్నారని నెల్లూరు జిల్లా కలిగిరి మండలం బుచ్చిరెడ్డిపాలేనికి చెందిన వెంకటేశ్వరరెడ్డి ఫిర్యాదు చేశారు. ఎన్‌హెచ్-16 విస్తరణలో భూములు కోల్పోయిన తమకు నెలలు గడుస్తున్నా పరిహారం చెల్లించలేదని పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి గ్రామానికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఎలాగైనా పరిహారం ఇప్పించాలని నేతలను వేడుకున్నారు.
తన భూమిని కబ్జా చేయాలని చూస్తున్న వైఎస్సార్సీపీ నేతలకు అధికారులు సహకరిస్తున్నారని పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం వెలగలేరుకు చెందిన భాస్కర్‌రెడ్డి వాపోయారు. ప్రతి ఒక్కరి సమస్యలు గురించి విన్న నేతలు బాధితుల నుంచి ఫిర్యాదులు తీసుకుని సమస్యలు వీలైనంత తొందరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
'ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని కబ్జా చేశారు' - 'వీఆర్వోపై చర్యలు తీసుకోండి'
బిడ్డను చంపేశారు - అడిగితే బెదిరిస్తున్నారు - చంద్రబాబు ఎదుట తల్లి ఆవేదన