LIVE : తెలంగాణ లోక్సభ ఎన్నికల పోలింగ్ - ప్రత్యక్షప్రసారం - LOK SABHA ELECTIONS POLLING LIVE - LOK SABHA ELECTIONS POLLING LIVE
Published : May 13, 2024, 7:06 AM IST
|Updated : May 13, 2024, 7:55 PM IST
Telangana Lok Sabha Elections polling 2024 : రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి భారీగా తరలివస్తున్నారు. ఈవీఎంల మొరాయింపు వంటి సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే సరిచేసేందుకు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ముగ్గురు ఈసీఐఎల్ ఇంజినీర్లను నియమించారు. నమూనా పోలింగ్ ముగిసిన తర్వాత, ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ కొనసాగుతోంది. తీవ్రవాద ప్రాబల్యమున్న 5 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుండగా, మిగతా 106 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.17 లోక్సభ నియోజకవర్గాల్లో 525 అభ్యర్థులు బరిలో నిలవగా, వారిలో 50 మంది మహిళలు ఉన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో అత్యధికంగా సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో 45 మంది పోటీలో ఉన్నారు. అతి తక్కువగా ఆదిలాబాద్లో 12 మంది బరిలో నిలిచారు. అభ్యర్థుల భవితవ్యాన్ని 3,32,32,318 మంది ఓటర్లు తేల్చనున్నారు. రాష్ట్రంలో పురుషుల కన్నా మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.
Last Updated : May 13, 2024, 7:55 PM IST