LIVE : బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - tg FORMATION DAY at bjp office - TG FORMATION DAY AT BJP OFFICE
Published : Jun 2, 2024, 9:11 AM IST
|Updated : Jun 2, 2024, 9:49 AM IST
Telangana Formation Day Celebrations Under BJP : రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దశాబ్ది వేడుకలను పురష్కరించుకొని ప్రభుత్వ కార్యాలయాలు, చారిత్రక కట్టడాలు వంటి ప్రసిద్ధమైన వాటిని విద్యుత్ దీపాలతో సుందరంగా ముస్తాబు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ వేడుకలను నిర్వహిస్తోంది. కానీ బీఆర్ఎస్, బీజేపీలు వేర్వేరుగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ హైదరాబాద్లోని కేంద్ర బీజేపీ కార్యాలయంలో శతాబ్ది వేడుకలను నిర్వహించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి జాతీయ జెండాను పార్టీ ఆఫీసులో ఎగురవేశారు. అనంతరం తెలంగాణ అమరవీరులను స్మరించుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది ఉద్యమకారులు అమరవీరులన్నాయని, వారి త్యాగాల ఫలితమే తెలంగాణ ఆవిర్భావం అని కొనియాడారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు సంబంధించి బీజేపీ చేసిన కృషిని బీజేపీ నాయకులు గుర్తు చేసుకున్నారు. ఈ వేడుకల్లో బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Last Updated : Jun 2, 2024, 9:49 AM IST