LIVE : వేములవాడ బహిరంగ సభ పాల్గొన్న సీఎం రేవంత్రెడ్డి
Published : 4 hours ago
|Updated : 2 hours ago
CM Revanth Reddy in Public Meeting Live : రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి పర్యటించారు. దాదాపు 500 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తొలుత హెలికాప్టర్లో వేములవాడకు చేరుకున్న సీఎం రేవంత్, వేములవాడలో రాజన్నను దర్శించుకున్నారు. అనంతరం ఆలయాభివృద్ది పనులు, రాజన్నసిరిసిల్ల జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు. రూ. 235 కోట్లతో 4 వేల 696 మిడ్ మానేరు రిజర్వాయర్ నిర్వాసితులకు నిర్మించే ఇందిరమ్మ ఇళ్ల పనులకు భూమిపూజ చేశారు. రూ. 35 కోట్లతో చేపట్టే అన్నదాన సత్రం, రూ. 26 కోట్లతో నిర్మించిన ఎస్పీ భవనం, వర్కింగ్ ఉమెన్ హాస్టల్ భవనాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా గల్ఫ్ దేశాల్లో మరణించిన 17 కుటుంబాలకు 85 లక్షల పరిహారం పంపిణీ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బహిరంగా సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు.
Last Updated : 2 hours ago