LIVE : తెలంగాణ బడ్జెట్‌పై నేతల స్పందన - ప్రత్యక్షప్రసారం - తెలంగాణ బడ్జెట్
Published : Feb 10, 2024, 11:28 AM IST
|Updated : Feb 10, 2024, 3:42 PM IST
Telangana Budget Debate Live : అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ రోజు 2024-25 ఆర్థిక సంవత్సరం కోసం వార్షిక ప్రణాళికను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆర్థిక శాఖ బాధ్యతలు చూస్తున్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. అదే తరహాలో రాష్ట్రంలోనూ ప్రవేశపెట్టింది. శాసనసభ ఓట్ ఆన్ అకౌంట్ అయినప్పటికీ ఏడాదికి సరిపడా ప్రతిపాదనలు ఉండనున్నాయి. అయితే పూర్తి బడ్జెట్ తరహాలో సమగ్ర వివరాలు లేవు. ఆయా శాఖల పద్దులకు సంబంధించి కూడా పూర్తి వివరాలు లేవు. లోక్‌సభ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ సమయంలో అన్ని అంశాలను మరింత సమగ్రంగా బేరీజు వేసుకొని అవసరమైన మార్పులు, చేర్పులు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. తాజాగా 2024-25 ఏడాదికి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన 2.75 లక్షల కోట్ల బడ్జెట్‌పై చర్చా కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం.