LIVE : తెలంగాణ భవన్ నుంచి ప్రత్యక్ష ప్రసారం - Telangana Bhavan Live
Published : May 29, 2024, 3:07 PM IST
|Updated : May 29, 2024, 3:29 PM IST
Telangana Bhavan Live : రాష్ట్రంలో రైతుల పరిస్థితులు చూస్తుంటే గుండెలు తరుక్కుపోతున్నాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి నానా తిప్పలు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలు దాటినప్పటికీ ఇంకా పరిస్థితులు చక్కదిద్దలేదన్నారు. ధాన్యం కొనుగోళ్లులో తీవ్రమైన జాప్యం జరుగుతుందని ఆరోపిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రైతుల ధాన్యం తడిచి తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యారన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వాన్ని రైతులు పోల్చుకుంటున్నారన్నారు. గత ప్రభుత్వం చేయనివి, మీరు(కాంగ్రెస్) చేసి మెప్పు పొందండి. పంట నష్ట పోయిన రైతులు అందరికీ పరిహారం ఇవ్వాల్సిందే. పాలన చేతగాక నిందలతో కాలం గడుపుతున్నారన్నారని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లులో వేగం పెంచేందుకు చర్యలు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉదాసీన వైఖరి విడాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లు, రైతులకు సంబంధించిన పలు విషయాలకు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు.
Last Updated : May 29, 2024, 3:29 PM IST