ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE:ఓటమి భయంతోనే వైఎస్సార్సీపీ నేతల దాడులు - సోమిరెడ్డి చంద్రమోహన్​రెడ్డి మీడియా సమావేశం - Chandra sekhar reddy live - CHANDRA SEKHAR REDDY LIVE

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 16, 2024, 11:07 AM IST

Updated : May 16, 2024, 11:20 AM IST

LIVE : ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ప్రశాంతంగా జరిగే ప్రాంతాల్లో కూడా విధ్వంసాన్ని సృష్టించారు. టీడీపీ కార్యకర్తలపై కర్రలు, రాళ్లుతో దాడి చేసి వారిని గాయపరిచారు. పలు ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ నాయకుల ఆగడాలను అడ్డుకోలేక పోలీసులు చేతులెత్తేశారు. ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించడంలో పోలీసు యంత్రాంగం ఘోరంగా విఫలమైంది.తెలుగుదేశానికి బలమైన ఓటు బ్యాంకు ఉన్న ఈ కేంద్రంలో భయాందోళనలు సృష్టించి పోలింగ్ జరగకుండా చేసేందుకు యత్నించారు. తెలుగుదేశం నాయకులపై రాళ్లు రువ్వి, కట్టెలతో బీభత్సం సృష్టించారు. దాదాపు రెండు గంటల పాటు పోలింగ్‌కు అంతరాయం కలిగించారు. దొంగఓట్లు వేసేందుకు యత్నిస్తున్నవారిని అడ్డుకున్న తెలుగుదేశం బూత్‌ ఏజెంట్లపైనే దాడి చేశారు. పోలింంగ్ అనంతరం వైఎస్సార్సీపీ నేతలు టీడీపీ కార్యకర్యలపై దాడులను కొనసాగించారు. వైఎస్సార్సీపీ నాయకుల అరాచకాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలుగుదేశం నేతలు తెలిపారు. పోలీసులు ఇంకా జగన్‌ కనుసన్నల్లో నడుస్తున్నారని మండిపడ్డారు. ఓటమి భయంతోనే వైఎస్సార్​సీపీ నేతల దాడులు -  ఈ ఘటనలపై  టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్​రెడ్డి మీడియా సమావేశం  నిర్వహించారు. పత్యక్ష ప్రసారం మీకోసం
Last Updated : May 16, 2024, 11:20 AM IST

ABOUT THE AUTHOR

...view details