రాజ్యాంగేతర శక్తులుగా ప్రభుత్వ సలహాదారులు - వెంటనే తొలగించాలి: విజయ్‌కుమార్ - VIJAYKUMAR ON ADVISORS - VIJAYKUMAR ON ADVISORS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 17, 2024, 1:34 PM IST
TDP Leader Nilayapalem Vijaykumar : రాష్ట్రంలో రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ సలహాదారులను తక్షణమే పదవుల నుంచి తొలగించాలని తెలుగుదేశం డిమాండ్ చేసింది. వారు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.
రాష్ట్రంలో అసలు ఈ సలహాదారులు ఎవరని, ఈ ఐదేళ్లు సలహాదారులకు ఉన్న వారి అర్హతలు ఏంటని నీలాయపాలెం విజయ్‌కుమార్ ప్రశ్నించారు. కేబినెట్ ఏర్పడక ముందే జగన్ సలహాదారులను నియమించుకోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఐదు సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపింది జగనా, లేక సలహాదారులా అని అనుమానం వ్యక్తం చేశారు. సాక్షి ఉద్యోగులు, జగన్ రెడ్డి సామాజిక వర్గం, జగన్ అనుంగ అధికారులకే సలహాదారుల పదవులు ఇచ్చారని ఆయన ఆరోపించారు. ఒక సలహాదారుడికి నెలకు రూ. 30 లక్షల వరకు జగన్ ఖర్చు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నామ్ కే వాస్తిగా మంత్రులు ఐదేళ్లు ప్రభుత్వాన్ని నడిపారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నాయకులపై విమర్శలు చేయడమే సలహాదారులు చేసిన పని అని మండిపడ్డారు. 60 మంది జంబో సలహదారుల టీమ్‌తో అంజయ్య కేబినెట్ జగన్ దాటేశారని విజయ్‌కుమార్ దుయ్యబట్టారు.