LIVE బీసీల అభ్యున్నతే లక్ష్యంగా ఈ నెల 5న 'బీసీ డిక్లరేషన్'- కొల్లు రవీంద్ర మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం - TDP BC Declatation LIve
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 2, 2024, 3:11 PM IST
LIVE : బీసీల అభ్యున్నతి మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని, రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని టీడీపీ నేత అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం బీసీలకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రాభివృద్ధి పడకేసిందని అన్నారు. టీడీపీతోనే బీసీలకు సముచిత గౌరవం లభిస్తుందని తెలిపారు. పేదల సంక్షేమానికి టీడీపీ హయాంలో ప్రవేశపెట్టిన అనేక పథకాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆగ్రహం వ్యక్తం చేశారు." టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆదరణ కార్యక్రమంతో బీసీలను ఆదుకున్నాం, 90 శాతం సబ్సిడీతో లబ్ధిదారులకు పరికరాలు అందజేశాం. 125 కులాలకు ఆర్థికసాయం చేసిన పార్టీ తెదేపా. కార్పొరేషన్ల ద్వారా రూ.3,500 కోట్లు ఖర్చు చేశాం. రూ.75వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి.. నాలుగేళ్లలో బీసీలకు ఒక్క రూపాయి అయినా జగన్ ఇచ్చారా? కార్పొరేషన్లు పెట్టి నిధులు లేకపోతే లాభమేంటి?రూ.వందల కోట్ల విలువ చేసే పరికరాలను వైసీపీ ప్రభుత్వం గోదాముల్లో ఉంచేసింది. వాటిని తుప్పు పట్టేలా మార్చారు తప్ప పేదలకు ఇవ్వలేదు." టీడీపీ నేతలు తెలిపారు. బీసీల అభ్యున్నతే లక్ష్యంగా ఈ నెల 5న 'బీసీ డిక్లరేషన్' కార్యక్రమం ఏర్పాటు చేశామని కొల్లు రవీంద్ర తెలిపారు.