తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాల ప్రారంభోత్సవం - ఉచిత విద్యుత్ పథకం లాంఛ్

By ETV Bharat Telangana Team

Published : Feb 27, 2024, 3:56 PM IST

Updated : Feb 27, 2024, 4:34 PM IST

Subsidy Gas Cylinder and Free Electricity Schemes launch Live : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీల అమలులో నేడు మరో కీలక అడుగు ముందుకు పడింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రెండు పథకాలు అమలు చేస్తుండగా, ఇవాళ మరో రెండింటికి శ్రీకారం చుట్టింది. గృహజ్యోతిలో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, మహాలక్ష్మిలో భాగంగా రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకాలను ఈరోజు మధ్యాహ్నం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. చేవెళ్లలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ఈ పథకాలు ప్రారంభించాలని తొలుత భావించినా, ఎమ్మెల్సీ ఎన్నిక కోడ్ అమల్లోకి రావడంతో వేదిక మార్చారు. చేవెళ్లలోని ఫరా ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో సాయంత్రం కాంగ్రెస్ పార్టీ నిర్వహించే సభలో సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొంటారు. కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీ పర్యటన రద్దు కావడంతో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సభలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Last Updated : Feb 27, 2024, 4:34 PM IST

ABOUT THE AUTHOR

...view details