YUVA : సమంత, సాయిపల్లవి లాంటి స్టార్ హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పింది నేనే : ఆద్య హనుమంతు - Story On Dubbing Artist Aadhya - STORY ON DUBBING ARTIST AADHYA
Published : Sep 7, 2024, 5:49 PM IST
Story On Dubbing Artist Aadhya Hanumanthu : చలాకీగా అచ్చం సాయిపల్లవిలా మాట్లాడేస్తున్న ఆ గొంతుకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఇంత అందంగా మాట్లాడేది ఓ అబ్బాయి అని తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. ఇదొక్కటేనా నృత్యం, సంగీతం, నటన, చదువు ఇలా అన్నింటినిలోనూ వారెవ్వా అనిపిస్తున్నాడు. మెడిసిన్ చదువుతూనే డబ్బింగ్ కళాకారుడిగా సత్తా చాటుతున్నారు ఆద్య హనుమంతు. టాప్ హీరోయిన్లకు ఆద్య గాత్రదానం చేస్తున్నారు. ప్రముఖ హీరోయిన్ సమంత, సాయిపల్లవి లాంటి మరెంతో మంది హీరోయిన్లకు డబ్బింగ్ చెబుతూ తన ప్రత్యేకతను చాటుకున్నారు.
డబ్బింగ్ చెప్పడాన్ని ఓ హాబీగా మొదలుపెట్టిన ఆద్య హనుమంతు అనతి కాలంలోనే మంచి గుర్తింపు పొందారు. అతను కష్టం ఊరికే పోలేదు. 2023లో జాతీయ ఉత్తమ వాయిస్ ఓవర్‌గా అవార్డును దక్కించుకున్నారు. ఎంబీబీఎస్ పూర్తిచేసిన ఆద్య హనుమంతు ప్రస్తుతం సైకియాట్రీలో పీజీ చేస్తున్నారు. డాక్టర్‌గా ప్రజలకు సేవలందిస్తూ, మరోవైపు ఆర్టిస్‌గా మంచి పేరుతెచ్చుకోవాలనేదే తన లక్ష్యమంటున్న ఆద్య హనుమంతుతో మా ప్రతినిధి ముఖాముఖి.