తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : భద్రాచలంలో తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు - bhadrachalam live - BHADRACHALAM LIVE

By ETV Bharat Telangana Team

Published : Apr 18, 2024, 10:10 AM IST

Updated : Apr 18, 2024, 1:01 PM IST

Thiru Kalyana Brahmotsavam LIVE : భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో వసంతపక్ష శ్రీరామనవమి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్ష్మణ సమేత సీతారాములకు స్వర్ణ చంద్రప్రభ వాహనంపై తిరువీధి సేవ ఘనంగా జరిగింది. సీతారాముల కల్యాణం అనంతరం పట్టు వస్త్రాలతోనే తిరువీధి సేవలో విహరించారు. ఈ రోజు మిథిలా స్టేడియంలో సీతారాములకు మహా పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవానికి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ హాజరైన నేపథ్యంలో, అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.భద్రాద్రి రాములోరి కల్యాణ వేడుక కనుల పండువగా సాగింది. అభిజిత్‌ లగ్నంలో రాముడు, జగన్మాత సీతమ్మ మెడలో మాంగళ్యధారణ చేశారు. ప్రభుత్వం తరఫున సీఎస్‌ శాంతికుమారి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. దేవదేవుడి కల్యాణవైభోగాన్ని కనులారా వీక్షించిన భక్తజనం పులకించారు. కల్యాణ క్రతువులో తిరుకల్యాణానికి సంకల్పం పలికి సర్వవిజ్ఞాన శాంతికి విశ్వక్సేన ఆరాధన నిర్వహించారు. ఆ తర్వాత కల్యాణానికి ఉపయోగించే సామాగ్రికి సంప్రోక్షణ తర్వాత రక్షా బంధనం నిర్వహించి యోక్త్రధారణ చేశారు. 12 దర్బలతో ప్రత్యేకంగా అల్లిన తాడును సీతమ్మవారి నడుముకు అలంకరించారు.
Last Updated : Apr 18, 2024, 1:01 PM IST

ABOUT THE AUTHOR

...view details