ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో స్నేహపూర్వక సేవలు అందించడమే లక్ష్యం: ఆర్పీ సిసోదియా - Sisodia Removed Podium - SISODIA REMOVED PODIUM

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 16, 2024, 10:42 PM IST

Sisodia Removed Podium in Gunadala Sub Registrar Office: సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో స్నేహపూర్వక సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ స్పెషల్‌ సీఎస్‌ ఆర్పీ సిసోదియా(Revenue Special CS RP Sisodia) తెలిపారు. విజయవాడ గుణదల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలోని పోడియంను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌లతో కలిసి ఆయన తొలగించారు. ఇకపై రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో క్రయవిక్రయదారులు మంచి వాతావరణంలో సేవలు పొందుతారని అన్నారు. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో అత్యంత పారదర్శకంగా క్రయవిక్రయాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని కల్పిస్తున్న క్రయవిక్రయదారులతో మర్యాదపూర్వకంగా ఉండాల్సిన బాధ్యత అధికారులపై ఉందని సిసోడియా సూచించారు. ఎక్కడైనా అవినీతి, లంచానికి, నిబంధనలకు వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో రాచరిక పోకడలు ఉండకూడదు: ప్రభుత్వ కార్యాలయాలంటే ప్రజలకు సేవలందించేవిగా ఉండాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో రాచరిక పోకడలు ఉండకూడదని, అందుకే సీఎం చంద్రబాబు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో పోడియంలను తీసేయాలని నిర్ణయించారని చెప్పారు. ఇటువంటి సంస్కరణలు ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబాలుగా నిలుస్తాయని కొనియాడారు. క్రయవిక్రయదారులకు నిస్వార్థమైన సేవలందించాలని ఉద్యోగులకు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details