యాదాద్రిలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం - కూలిన చలువ పందిళ్లు, రేకుల షెడ్లు - Rain Effect in yadadri temple - RAIN EFFECT IN YADADRI TEMPLE
Published : May 7, 2024, 9:07 PM IST
Huge Rain Effect in Yadadri Temple : యాద్రాది భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ సన్నిధిలో ఇవాళ భీకరమైన ఈదురుగాలులుతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో కురిసిన వర్షం ధాటికి కొండపై వేసవి తాపానికి భక్తుల కోసం వేసిన చలువ పందిర్లు, రేకుల షెడ్లు, పార్కింగ్ షెడ్లు కుప్పకూలి చెల్లాచెదురయ్యాయి. దీంతో రేకుల షెడ్లు కింద పార్కింగ్ చేసిన దాదాపు 10 ద్విచక్రవాహనాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి.
Heavy Rain yadadri Temple Today : అనంతరం నేలకొరిగిన వాహనాలను ఆలయ సిబ్బంది తొలిగించారు. ఇవాళ పడిన వర్షానికి కొండపై చలువ పందిర్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. కొద్దిసేపటి వరకు భక్తులు వర్షంలో తడుస్తూనే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకున్నారు. గతంలో కూడా యాద్రాది ఆలయం నిర్మాణంలో ఉన్నప్పుడు భారీ వర్షానికి భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. మరోవైపు రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీగా ఈదురు గాలులుతో కూడిన వడగళ్ల వాన ముంచెత్తింది.