తెలంగాణ

telangana

ETV Bharat / videos

కుంభారిలో సాయిబాబా ఆలయ మూడో వార్షికోత్సవ వేడుకలు - పాల్గొన్న భాగ్యనగర వాసులు - Sai Baba Temple in Maharashtra

By ETV Bharat Telangana Team

Published : Feb 16, 2024, 10:21 PM IST

Sai Baba Temple Anniversary Celebrations in Maharashtra : మహారాష్ట్రలోని అహ్మద్​నగర్ జిల్లాలో కుంభారి గ్రామంలో సాయిబాబా ఆలయ మూడో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కోపర్​గావ్ తాలూకాలోని కుంభారిలోని దేవాలయంలో అనేంక్ సంత్ మహంత సమక్షంలో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వార్షికోత్సవ వేడుకలకు హైదరాబాద్ నగరం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. దక్షిణాది నుంచి వచ్చిన భక్తులకు కుంభారి గ్రామస్థులు తెలుగు, మరాఠీ పాటలతో, అలాగే రంగోలీలు, పూలతో ఘన స్వాగతం పలికారు. ముందుగా కుంభారి గ్రామస్థులు చిన్నపాటి కార్యక్రమంతో అతిథులను సత్కరించారు.

Sai Baba Temple Celebrations : అనంతరం బాణసంచా, డీజేలతో గ్రామమంతా ఊరేగింపు నిర్వహించారు. గ్రామస్థుల అభిమానానికి భాగ్యనగరం వాసులు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన సాయి భక్తులు రూ.7 లక్షల విలువైన బంగారం, ఇత్తడి (Brass) సింహాసనం, రూ. 5 లక్షల విలువైన సాయిబాబా విగ్రహం, రెండు వెండి కిరీటాలను విరాళంగా అందజేశారు. సాయిబాబాకు సేవ చేసే అవకాశం వచ్చినందుకు భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details