తెలంగాణ

telangana

ETV Bharat / videos

YUVA : అక్షరంతో యుద్ధం చేస్తూ కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురష్కారానికి ఎంపికైన గిరిపుత్రుడు - ramesh karthik nayak inter view - RAMESH KARTHIK NAYAK INTER VIEW

By ETV Bharat Telangana Team

Published : Jun 28, 2024, 9:41 PM IST

Updated : Jun 28, 2024, 9:46 PM IST

Sahitya Akademi 2024 Yuva Puraskar Winner Interview : ఏ పూట ఎక్కడుంటారో తెలియని సంచార జీవితాలు వాళ్లవి. సమాజానికి దూరంగా చెట్టు పుట్టలే ప్రపంచాలుగా జీవనం సాగిస్తుంటారు. వాళ్ల భాష, యాస, కూడు, గూడు వేరే. వాళ్ల జీవన శైలి విభిన్నం. కానీ భూమిపై అందరిలాగే మనుషులు వాళ్లు. అలాంటి తెగ నుంచి ఓ గిరిపుత్రుడు అక్షర యోధుడిగా మారాడు. పుట్టిన నేలకు, తన జీవితానికి, తన అనుభవాలకు తానే అతిథిగా మారి తన జాతి ఉనికి కోసం అక్షర యుద్ధం చేస్తున్నాడు. తానే నిజామాబాద్ జిల్లా జక్రాన్​పల్లి తండాకు చెందిన యువకుడు రమేశ్ కార్తీక్ నాయక్. 

గిరిజన బంజారా ఆదివాసీ తెగలపై రచనలు చేస్తూ సాహిత్యలోకంతో ప్రశంసలందుకుంటున్నాడు. రమేశ్ కార్తీక్ నాయక్ రచించిన 'బల్దేర్ బండి' కవితలు విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలయ్యాయి. హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లోకి అనువాదమై అభినందనలు అందుకున్నాయి. గోర్ బంజారా కుటుంబంలో పుట్టి పిన్న వయస్సులోనే రావిశాస్త్రి కథా పురస్కారం సహా పలు అవార్డులు అందుకున్న ఈ యువకుడు. తాజాగా 2024 'కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి' ఎంపికయ్యాడు. ఢావ్లో గోర్ బంజారా కథల సంపుటికి గాను రమేశ్ కార్తీక్ నాయక్ కేంద్ర సాహిత్య యువ పురస్కారం దక్కింది. తెలుగు రాష్ట్రాల్లోని గిరిజన ఆదివాసి సమూహాల నుంచి ఈ పురస్కారానికి ఎంపికైన తొలి రచయిత రమేశ్ కార్తీక్ నాయక్​తో ఈటీవీ భారత్​/ఈటీవీ ముఖాముఖి.

Last Updated : Jun 28, 2024, 9:46 PM IST

ABOUT THE AUTHOR

...view details