తెలంగాణ

telangana

ETV Bharat / videos

మేడారం వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ - పలువురికి గాయాలు - RTC Medaram BUS Accident

By ETV Bharat Telangana Team

Published : Feb 21, 2024, 12:07 PM IST

RTC Medaram Bus Accident in Medipally : మేడారం వెళ్తున్న ఆర్టీసీ బస్సును బొగ్గు లారీ ఢీకొట్టింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం మేడిపల్లి శివారు అటవీ ప్రాంతంలో ఆర్టీసీ బస్సును లారీ ఢీకొనడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, మంచిర్యాల డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు సుమారు 50 మందికి పైగా ప్రయాణికులతో కాటారం మీదుగా మేడారం వెళ్తుంది.Medaram Devotees Injured after truck hit RTC Bus : భూపాలపల్లి నుంచి కాటారం వైపుగా బొగ్గుతో వస్తున్న లారీ మేడిపల్లి శివారు అటవీ ప్రాంతంలో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆర్టీసీ డ్రైవర్​తో పాటు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ క్యాబిన్​లో చిక్కుకోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. క్షతగాత్రులను అంబులెన్స్​లో భూపాలపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో వాహనాలు నిలవగా పోలీసులు ట్రాఫిక్​ను క్రమబద్దీకరించారు.

ABOUT THE AUTHOR

...view details