తెలంగాణ

telangana

ETV Bharat / videos

విజయవాడను వీడని వర్షం - వరద నీటిలో మునిగిన నెహ్రూ బస్టాండ్ - vijayawada rain news today - VIJAYAWADA RAIN NEWS TODAY

By ETV Bharat Telangana Team

Published : Aug 31, 2024, 7:06 PM IST

Heavy Rain Fall in Vijayawada Today : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విజయవాడ తడిసిముద్దయింది. దీంతో ప్రధాన రహదారులపైకి భారీగా వరద నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పండిత్​ నెహ్రూ బస్టాండ్​లోకి వరద ముంచెత్తడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. అలాగే రైల్వే వర్క్​ షాపులోకి భారీగా నీరు చేరింది. రైల్వే బ్రిడ్జి కింద భారీగా వరద నీరు నిలిచిపోవడంతో లారీలు సగం వరకు మునిగిపోయాయి. 

అలాగే రహదారులపై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచి ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విజయవాడలోని భవానీ ఫ్లైఓవర్​ వర్షానికి మూసేశారు. రెండు రోజుల పాటు ఇదే రీతిలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎటుచూసిన వర్షపు నీరు ఉండడంతో అడుగు తీసి అడుగు బయటకు వేయాలంటే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details