భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం - 45 అడుగులకు చేరిన ప్రవాహం - Godavari Water level Increases - GODAVARI WATER LEVEL INCREASES
Published : Jul 31, 2024, 11:22 AM IST
Bhadrachalam Godavari Water level : భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మళ్లీ క్రమంగా పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా పెరుగుతూ తగ్గుతూ వస్తున్న గోదావరి మంగళవారం రాత్రి నుంచి మళ్లీ క్రమంగా పెరుగుతోంది. బుధవారం ఉదయం 8 గంటలకు గోదావరి నీటిమట్టం 45 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. గత కొన్ని రోజుల నుంచి గోదావరి నీటిమట్టం 43 అడుగులపైన ప్రవహిస్తుండటంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
గోదావరి నీటిమట్టం పెరిగే అవకాశం : గోదావరి పెరిగి తగ్గడంతో స్నాన ఘట్టాల ప్రాంతం వద్ద ఒండ్రు మట్టి పేరుకుపోయింది. పంచాయతీ సిబ్బంది ఒకవైపు మట్టిని తొలగిస్తున్నప్పటికీ మరోవైపు గోదావరి పెరగడంతో మళ్లీ ఒండ్రు మట్టి పేరుకుపోతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం దిగువన ఉన్న శబరి ఉపనది పోటెత్తుతోంది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు తెలుపుతున్నారు.