తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : దిల్లీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు - ప్రత్యక్షప్రసారం - REPUBLIC DAY 2025 CELEBRATIONS LIVE

By ETV Bharat Telangana Team

Published : Jan 26, 2025, 10:09 AM IST

Updated : Jan 26, 2025, 12:30 PM IST

Republic Day 2025 LIVE : దేశవ్యాప్తంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎర్రకోటపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తివర్ణ పతకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా భారత్​ తన సైనిక సామర్థ్యాన్ని, ఘనమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వర్ణిమ్​ భారత్​, విరాసత్​ ఔర్​ వికాస్​ అనే ఇతివృత్తంతో ఈసారి గణతంత్ర వేడుకలు నిర్వహిస్తున్నారు. డీఆర్​డీఓ అభివృద్ధి చేసిన ఉపరితలం నుంచి ఉపరితలంపై లక్ష్యాలను ఛేదించే ప్రళయ్​ బాలిస్టిక్​ క్షిపణిని తొలిసారిగా రిపబ్లిక్​ పరేడ్​లో ప్రదర్శిస్తున్నారు. ఈసారి గణతంత్ర వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబో వో సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రిపబ్లిక్​ పరేడ్​లో 16 రాష్ట్రాలు, యూటీలు, 10 కేంద్ర ప్రభుత్వ శాఖల శకటాలు పాల్గొన్నాయి. దిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రిపబ్లిక్​ డే పరేడ్​ను ప్రత్యక్షంగా 77 వేల మంది వీక్షిస్తున్నారు.
Last Updated : Jan 26, 2025, 12:30 PM IST

ABOUT THE AUTHOR

...view details