వైఎస్సార్సీపీ పాలనలో బతుకు భారంగా మారింది- రేషన్ డీలర్లు అసోసియేషన్ అధ్యక్షులు - Ration Dealers comments on ysrcp
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 25, 2024, 5:59 PM IST
Ration Dealers Fired On YSRCP Government: వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో బతుకు భారంగా మారిందని రేషన్ డీలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. నెలకు వచ్చే ఐదారు వేల రూపాయిల జీతంతో కుటుంబ పోషణ కష్టమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బకాయి బిల్లులు (Pending Bills) చెల్లించకుండా వైసీపీ ప్రభుత్వం (YSRCP Government) ఇబ్బంది పెడుతోందని రేషన్ డీలర్లు మండిపడ్డారు.
గతంలో బియ్యంతో పాటు ఇతర నిత్యవసర సరుకుల రేషన్ దుకాణాల్లో ఇచ్చే వాళ్లమని దీంతో ప్రజలకు అనేక రకాల సరుకులు అందడంతో పాటు తమకూ అదనంగా ఆదాయం వచ్చేదని తెలిపారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రేషన్ డీలర్ల పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక వేతన చట్టం ప్రకారం తమకు ఇచ్చే కమీషన్ పెంచాలని అన్ని రాజకీయ పార్టీలను కలుస్తున్నామని, అనుకూలంగా ఉన్న పార్టీకి ఎన్నికల్లో సహకరించడానికి నిర్ణయించుకున్నామని రాష్ట్ర రేషన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దివి లీలా మాధవరావు పేర్కొన్నారు.