ETV Bharat / state

కాటు వేయకుండానే ఇద్దరి ప్రాణాలు తీసిన పాము - ఎలాగంటే ! - UNCLE AND NEPHEW DIED

కనిమెట్ట గ్రామంలో విషాదం - నూతిలో పడి ఇద్దరు మృతి

Two Died After Falling Into a Well
Two Died After Falling Into a Well (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 16, 2024, 8:26 PM IST

Two Died After Falling Into a Well in Srikakulam District: కార్తిక పౌర్ణమి రోజు విషాదం చోటు చేసుకుంది. వారిద్దరూ మేనమామ, మేనల్లుడు. బావిలో పడిన మేనమామను రక్షించేందుకు ప్రయత్నించిన మేనల్లుడు సైతం జారిపడి మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం పొందూరు మండలం కనిమెట్ట గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. అసలు ఇంతకు ఏం జరిగిందంటే.

శుక్రవారం రాత్రి గ్రామంలోని రఘుపతి మధుసూదన్​ రావు (56) ఇంట్లోకి పాము వచ్చింది. అందరూ కంగారు పడ్డారు. ఆ కేకలకు ఇంట్లో నుంచి వచ్చిన మధుసూదన్​ రావు పామును చంపేందుకు యత్నించాడు. కర్రతో ఓ దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత పాము అక్కడే బావిలో పడిపోయింది. దీంతో అందరూ కంగారు పడ్డారు. శనివారం ఉదయం బావి నుంచి నీటిని తోడేయాలని భావించారు.

శనివారం ఉదయం బావిలో నీళ్లు తోడేందుకు సిద్ధమయ్యారు. ఇంజిన్​ సహాయంతో నీళ్లన్నీ బయటకు తీసేస్తున్నారు. కానీ ఇంతలోనే మరో ఘటన జరిగింది. నీటిని తోడుతున్న ఇంజిన్​ బావిలో పడిపోయింది. దీన్ని తీసే క్రమంలో మధుసూదన్​ రావు బావిలో పడిపోయాడు. ఇది చూసి అతన్ని రక్షించేందుకు మధుసూదన్​ రావు మేనల్లుడు కింతలి డిల్లేశ్వర రావు ప్రయత్నాలు మొదలు పెట్టాడు. బావిలోకి దిగి మేనమామను బయటకు తీసుకు రావాలనుకున్నాడు. ఇదే క్రమంలో డిల్లేశ్వరరావు బావికి దిగుతున్నాడు. కానీ మళ్లీ మరో ప్రమాదం జరిగింది. డిల్లేశ్వరరావు సైతం బావిలో పడిపోయాడు. ఈ క్రమంలో మేనమామ, మేనల్లుడులిద్దరూ ప్రాణాలొదిలారు.

ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. మృతదేహాలను బావి నుంచి తీసి పోస్ట్​మార్టం కోసం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు.

నేవీ క్వార్టర్స్‌లో గోల్డ్​ స్నేక్​ - ఆసక్తిగా తిలకించిన స్థానికులు

13ఏళ్లలో 19వేలకుపైగా పాములు- వాటి కోసమే ఆ యువకుడి పోరాటం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.