తెలుగువారి హృదయాల్లో రామోజీరావు చెరగని ముద్ర - Ramoji Rao Funeral on Sunday - RAMOJI RAO FUNERAL ON SUNDAY
Published : Jun 8, 2024, 2:16 PM IST
Ramoji Rao Passes Away : బహుముఖ ప్రజ్ఞ, కఠోర సాధన, ఇవే రామోజీ అస్త్రాలు. నలుగురు నడిచిన బాట కాదు. కొత్తదారులు సృష్టించడం ఆయన నైజం. లక్ష్య సాధనకు దశాబ్దాల పాటు నిర్విరామంగా పరిశ్రమించిన యోధుడు. రైతు బిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రాణించారు. మీడియా మహా సామ్రాజ్యాన్ని నిర్మించిన రామోజీరావు. చైతన్యదీప్తుల్లాంటి చిత్రరాజాలను సృజించారు. అద్భుత ఫిల్మ్‌సిటీని సృష్టించారు. తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.
Ramoji Rao History : ఆఖరి క్షణం వరకూ ప్రజా శ్రేయస్సు కోసమే పరితపించారు. పనిలోనే విశ్రాంతి అనేది ఆయన ప్రాథమిక సూత్రం. చివరి క్షణం వరకు పనిలోనే విశ్రాంతి సిద్ధాంతాన్ని పాటించిన మహనీయుడు. సమస్యలపై పోరాటంలో ఆయన తను ఒక స్ఫూర్తి. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అసామాన్య విజయాలు సాధించారు. ఆ మహనీయుడు శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా ఆయన తన జీవితకాలంలో సాధించిన విజయాలు, చేసిన సేవలను ఓసారి తలుచుకుందాం.