రైతు రుణమాఫీకి - ఆగస్టు నెలకు సంబంధం ఏంటి : రఘునందన్ రావు - Raghunandan Rao Comments on CM - RAGHUNANDAN RAO COMMENTS ON CM
Published : Apr 20, 2024, 8:04 PM IST
Raghunandan Rao React on cm Revanth Comments : రైతు రుణమాఫీకి - ఆగస్టు నెలకు సంబంధం ఏంటి అని మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. రుణమాఫీ చేయకపోతే రాజ్‌భవన్‌కు వచ్చి రాజీనామా చేయాలని అన్నారు. కేసీఆర్ దారిలోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ దోచుకున్న సొమ్మును పేదలకు పంచుతామని రేవంత్ అన్న వ్యాఖ్యలను గుర్తు చేశారు. ప్రస్తుతం ఎంతమందికి పంచారో సీఎం చెప్పాలని అడిగారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చేతుల మీదుగా బీ ఫాంను అందుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
Raghunandan Rao Fire on CM : మోదీ పదేళ్ల అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమేనని, రేవంత్ సిద్దమా? అని రఘనందన్ రావు సవాల్ విసిరారు. తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గర చర్చకు వెళ్దామా అని ప్రశ్నించారు. దుబ్బాకలో ఓడితే మెదక్‌లో పోటీ చేయకూడదా అని నిలదీశారు. కొడంగల్‌లో ఓడిన రేవంత్ రెడ్డి మల్కాజిగిరిలో గెలవలేదా అని గుర్తు చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులు దొంగ మాటలు చెప్పి దుబ్బాకలో రఘునందన్ రావును దొంగ దెబ్బ కొట్టారు తప్ప తాను ఓడిపోలేదని పేర్కొన్నారు.