హైదరాబాద్‌లో భారీ వర్షాలు - మల్లారెడ్డి యూనివర్సిటీ హాస్టల్స్‌లోకి వరద నీరు - Malla Reddy College Rain Water - MALLA REDDY COLLEGE RAIN WATER
Published : Sep 4, 2024, 12:13 PM IST
Malla Reddy College Hostel Submerged With Rain Water : ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం అర్ధరాత్రి హైదరాబాద్‌లోని పలుచోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపై నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కుత్బుల్లాపూర్ మైసమ్మ గూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీ సమీపంలో రోడ్డుపై వరద పొంగిపొర్లింది. సమీప హాస్టల్స్‌లోకి నీరు చేరి, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కనీస నిబంధనలు పాటించకుండా హాస్టల్ భవనాలు నిర్మించడం వల్లే వర్షపు నీరు చుట్టుముడుతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది కూడా ఇదే తరహాలో వరద హాస్టళ్లను ముంచెత్తింది.
మైసమ్మ గూడ చెరువు నాలా ఆక్రమణకు గురి కావడం వల్లే ప్రతి సంవత్సరం ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అక్కడి ప్రజలు వాపోతున్నారు. మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదని తెలిపారు. నాలాలకు అడ్డంగా ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలన్నారు. రాష్ట్రంలో మళ్లీ భారీ వర్షాల కురిసే అవకాశం ఉన్నందున ఈ మేరకు ఆయా జిల్లాల్లోని అధికారులు పునరావాస, సహాయక చర్యలపై దృష్టి పెట్టారు.