తెలంగాణ

telangana

ETV Bharat / videos

రాష్ట్రపతి గ్యాలెంటరీ పతకం దక్కడం పట్ల ఆనందంగా ఉంది : హెడ్ కానిస్టేబుల్ యాదయ్య - head constable yadaiah interview - HEAD CONSTABLE YADAIAH INTERVIEW

By ETV Bharat Telangana Team

Published : Aug 14, 2024, 10:16 PM IST

Head Constable Yadaiah Interview : ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు కత్తి పోట్లకు గురయి రక్తం చిందుతున్నా, ఏ మాత్రం బెరుకు లేకుండా దొంగను ఒడిసి పట్టుకున్న హెడ్‌ కానిస్టేబుల్‌కు జాతీయ స్థాయిలో పతకం లభించింది. కేంద్ర హోం శాఖ ప్రకటించిన ప్రతిష్ఠాత్మకమైన రాష్ట్రపతి గ్యాలెంటరీ పతకం హెడ్‌ కానిస్టేబల్‌ యాదయ్యకు దక్కింది. దేశంలోనే ఒకే ఒక్కడికి ఈ పతకం దక్కడంతో తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్‌ సహా పలువురు అధికారులు అతన్ని అభినందించారు. 

2000 సంవత్సరం బ్యాచ్‌కు చెందిన యాదయ్య సైబరాబాద్‌ కమిషనరేట్‌లోని చందానగర్‌, మియాపూర్‌, మాదాపూర్‌ తదితర ఠాణాల్లో విధులు నిర్వర్తించారు. గత ఏడాది గొలుసు దొంగలను పట్టుకునే క్రమంలో దొంగలు ఎదురు దాడికి దిగడంతో హెడ్ కానిస్టేబుల్​ యాదయ్య తీవ్రంగా గాయపడ్డాడు. అయినప్పటికీ సాహసం ప్రదర్శించి ఓ దొంగను పట్టుకున్నాడు. ప్రస్తుతం రాష్ట్రపతి గ్యాలెంటరీ పతకం ఈ ఒక్కడికి దక్కడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్న యాదయ్యతో మా ప్రతినిధి ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details