తెలంగాణ

telangana

ETV Bharat / videos

అవినీతి లంచావతారాల పీడ ఇంకెన్నాళ్లు - నిర్మూలన ఎలా ?

By ETV Bharat Telangana Team

Published : Jan 25, 2024, 9:13 PM IST

Prathidwani Debate On Corruption, Bribery In telangana : ప్రజలకు అవినీతి, లంచావతరాల పీడ మోయలేని భారంగా మారింది. ఏకంగా రాష్ట్ర అవినీతి నిరోధక విభాగం డీజీ సీవీ ఆనంద్ వ్యక్తం చేసిన అభిప్రాయాల తర్వాత జరుగుతోన్న చర్చ ఇది. అది ఇది అని లేదు. ఏ ప్రభుత్వ విభాగాన్ని తీసుకున్నా ఇదే దుస్థితి. రెవెన్యూ, పోలీస్, రవాణా, ఆబ్కారీ ఇలా ప్రతి శాఖ కార్యాలయాల్లో క్యాన్సర్ తొలిచినట్లు అవినీతి తొలిచేస్తోంది. అవినీతి చీడ పేద, సామాన్య, మధ్యతరగతి వర్గాల వారికి మోయలేని భారంగా మారుతోంది. అవినీతి మహమ్మారి పట్టుబడుతున్నా భయం జాడ లేని అధికారులు ఎందరో ఏళ్లు గడుస్తున్నా అవినీతిని ఎందుకు అరికట్టలేక పోతున్నాం? ఏం చేస్తే ప్రభుత్వ సేవల్ని ప్రజలకు హక్కుగా అందించవచ్చు? ఈ పరిస్థితుల్లో ఏసీబీ డీజీ వ్యక్తం చేసిన అభిప్రాయాల్ని ఎలా అర్థం చేసుకోవాలి? సర్వాంతర్యామిగా మారిన అవినీతిని ఎందుకు అరికట్టలేక పోతున్నాం? ఏం చేస్తే ప్రభుత్వ సేవల్ని ప్రజలకు హక్కుగా అందించవచ్చు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. 

ABOUT THE AUTHOR

...view details