ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

11 ఏళ్లు విధులు - జాగిలం శాండీ పదవీ విరమణ - సన్మానించిన పోలీసులు - POLICE DOG SANDY RETIREMENT

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 5, 2024, 2:16 PM IST

Police Dog Sandy Retirement Program : శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ కార్యాలయంలో జాగిలం శాండీ పదవీ విరమణ కార్యక్రమాన్ని పోలీసు అధికారులు ఘనంగా నిర్వహించారు. జిల్లాలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో జాగిలం శాండీ ఉత్తమ ప్రతిభ కనబరిచింది. జాగిలం శాండీ 11 సంవత్సరాల పదవి కాలం పూర్తి కావడంతో ఎస్పీ కార్యాలయంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో శాండీకి పోలీసులు సన్మానం చేశారు. 

Grand Feliciation to Dog Sandy : సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జాగిలం శాండీకి జిల్లా ఎస్పీ మాధవ రెడ్డి ప్రశంసా పత్రం అందజేశారు. పోలీసుల సమక్షంలో శాండీకి గౌరవంగా సన్మానం చేశారు. అలాగే శాండీ జాగిలాలను 11 సంవత్సరాలుగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ, ప్రకృతి వైపరీత్య పరిస్థితులలోను జాగిలం తన విధులను సమర్థవంతంగా నిర్వహించేలా కృషి చేసిన ఏఆర్ కానిస్టేబుల్ చన్నప్ప నాయక్​ను ఎస్పీ మాధవ రెడ్డి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details