Govt Not Renewal Cold Storage License in Guntur District : గుంటూరు జిల్లాలో శీతల గోదాముల లైసెన్స్ రెన్యూవల్‌కు నిబంధనలు అడ్డంకిగా మారాయి. మార్చి నెలతోనే గడువు ముగిసినా ఒక్కగోదాముకూ లైసెన్సు పునరుద్ధరించలేదు. ఎప్పుడో నిర్మించిన గోదాములకు కొత్తగా వచ్చిన ఫైర్ సేఫ్టీ చట్టాన్ని (Fire Safety Act) అన్వయించడంతో శీతల గోదాములకు లైసెన్సుల పునరుద్ధరణ కష్టంగా మారింది.
లైసెన్సుల రెన్యూవల్‌కు అడ్డంకులు : ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో 128 శీతల గోదాములు ఉన్నాయి. స్థానిక రైతులే కాకుండా వివిధ ప్రాంతాల రైతులు మిర్చి పంటను తెచ్చి గోదాముల్లో నిల్వ చేసుకుంటారు. పంటకు మంచి ధర లభించినప్పుడు లేదా నగదు అవసరమైనప్పుడు మిర్చిని విక్రయించుకుంటారు. శీతల గోదాముల నిర్వహణకు మార్కెంటింగ్ శాఖ నుంచి లైసెన్సు తీసుకుని ఐదేళ్లకోసారి పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. 2024 మార్చితో 105 శీతల గోదాములకు లైసెన్స్ గడువు ముగిసింది. రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకున్నవారికి మార్కెటింగ్ శాఖ అనుమతి ఇవ్వటం లేదు. మొదట్లో ఎన్నికల కోడ్ సాకు చూపించిన అధికారులు ఇప్పుడేమో ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ అడుగుతున్నారని యజమానులు వాపోతున్నారు.
అన్నదాతల అగచాట్లు - శీతల గోదాములు లేక పంటను నిల్వ చేసేందుకు విలవిల - FARMERS SUFFERING IN GUNTUR
జిల్లాలో 30, 20, 15 సంవత్సరాల క్రితం కట్టిన కోల్డ్ స్టోరేజీలు 80 శాతం ఉన్నాయి. వీటికి ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ రావాలంటే చాలా కష్టం. వాటి నిబంధనలు అనుగుణంగానే ఉంటేనే సర్టిఫికేట్ ఇస్తారు. దాన్ని సాకుగా పెట్టుకొని లైసెన్సులను రెన్యూవల్ చేయడం లేదు. లైసెన్సు రెన్యూవల్ చేయడానికి ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్కు ఎలాంటి సంబంధం లేదు. గతంలో లైసెన్సు ఇచ్చారు కదా. ఇప్పుడు ఇవ్వడానికి అభ్యతరం ఏంటీ - లాల్ వజీర్, నవదుర్గ కోల్డ్ స్టోరేజ్ యజమాని
ఎన్వోసీకి ముడిపెట్టడంపై ఆగ్రహం : ఫైర్ సేఫ్టీ చట్టం ప్రకారం శీతల గోదాములో పరికరాలు ఏర్పాటు చేసుకున్నా చాలా సమస్యలు తలెత్తుతాయని యజమానుల వాదన. రైతులు తమ పంటను నిల్వ చేసుకోవటం కోసం ఇచ్చే లైసెన్సుకు ఫైర్ ఎన్వోసీకి ముడిపెట్టడం సరికాదని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల ప్రయోజనాలు కాపాడాల్సిన అధికారులు ఎన్వోసీల పేరిట నోటీసులు ఇబ్బందులకు గురిచేయటంపై శీతల గోదాముల యజమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.