ETV Bharat / offbeat

"నాన్నా డబ్బు పంపండి ప్లీజ్‌" - అమెరికా నుంచి విద్యార్థుల ఫోన్ కాల్స్! - TRUMP RESTRICTIONS ON PARTTIME JOBS

ట్రంప్ ఎఫెక్ట్ : పార్ట్ టైం కొలువులు మానేస్తున్న విద్యార్థులు - ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు

trump-restrictions-on-parttime-jobs
trump-restrictions-on-parttime-jobs (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 31, 2025, 2:27 PM IST

Trump restrictions on parttime jobs : ఎన్నో ఆశలు, మరెన్నో ఆశయాలు, ఉన్నత లక్ష్యాలతో అమెరికా వెళ్లి పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకుంటున్న విద్యార్థులకు కష్టాలు చుట్టుముట్టాయా? తాజాగా అధికారంలోకి వచ్చిన ట్రంప్ నిర్ణయాలు మనవాళ్లను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టనున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వలస వాదులపై ఉక్కుపాదం మోపుతున్న 'పెద్దన్న' నిర్ణయంతో లక్షలాది మంది విద్యార్థులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

ఫోన్ రకం, బ్యాటరీ ఆధారంగా చార్జీలు!? - డాటా భద్రతపై నెటిజన్ల ఆందోళన

ఉద్యోగాలపై నిఘా

అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అధికారులు క్యాంపస్‌ బయట పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేసే విద్యార్థులపై నిఘా పెట్టారు. నిబంధనల ప్రకారం క్యాంపస్‌లో మాత్రమే ఈ ఉద్యోగాలకు అనుమతించగా బయట ఉద్యోగాలతో నెట్టుకొస్తున్న విద్యార్థులకు ఇది ఇబ్బందిగా మారింది. ఫీజులకు, ఖర్చులకు కటకట తప్పడం లేదు. పట్టుబడితే ఇంటికి పంపిస్తారేమో అనే భయంతో కొలువులు మానేస్తూ తల్లిదండ్రులకు ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నారు. కూకట్‌పల్లికి చెందిన ఓ విద్యార్థి టెక్సాస్‌లో ఎంఎస్‌ చదువుతున్నాడు. ఇక నుంచి మీరే నెలవారీ ఖర్చులకు పంపించాలని తనకు ఫోన్ చేశాడని విద్యార్థి తండ్రి వెల్లడించారు.

అధికారుల విస్తృత తనిఖీలు

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారంలోకి వచ్చింది మొదలు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయన రాకతో అక్కడున్న భారతీయ విద్యార్థులను కష్టాలు చుట్టుముట్టాయి. చదువుకుంటున్న క్యాంపస్​లో మాత్రమే ఉద్యోగాలు చేసుకోవాలనే నిబంధనలు ఉండగా అందరికీ దొరకడం కష్టం. దీంతో చాలా మంది బయట అతి తక్కువ వేతనానికే పనిచేస్తూ చదువుకొంటున్నారు. తాజాగా అక్రమ వలసదారులను గుర్తించేందుకు ఇమ్మిగ్రేషన్‌ అధికారులు సోదాలు చేస్తూ కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో తమపైనా నిఘా పెట్టారని భావిస్తున్న విద్యార్థులు పార్ట్‌ టైమ్‌ ఉద్యోగాలను త్యజించాల్సిన పరిస్థితి నెలకొంది.

'పద్మ' అవార్డు గ్రహీతలకు ఎలాంటి ప్రయోజనాలు? - ప్రత్యేక ప్యాకేజీ ఉంటుందా?

నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..

నిబంధనల ప్రకారం ఎఫ్‌-1 వీసాపై అమెరికాలో చదువుకోవడానికి వెళ్లిన విద్యార్థులు విద్యాసంస్థలో వారానికి 20 గంటల చొప్పున 'ఆన్‌ క్యాంపస్‌' పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేసుకోవచ్చు. వేసవి సెలవులు, సెమిస్టర్ల మధ్య వారానికి 40 గంటలు పనిచేసుకోవడానికి వీలుంటుంది. అంతే తప్ప చదువుకుంటూ క్యాంపస్ బయట మాత్రం పార్ట్‌టైమ్‌ జాబ్ చేయడానికి నిబంధనలు ఒప్పుకోవు. ప్రతి ఒక్కరికీ క్యాంపస్‌లో ఉద్యోగం దొరకదు కాబట్టి ఎక్కువగా సూపర్‌ మార్కెట్లు, పెట్రోల్‌ బంకులు, హోటళ్లు తదితరాల్లో పనిచేస్తున్నారు.

సూపర్‌ మార్కెట్లు, పెట్రోల్‌ బంకులు, హోటళ్లలో పనిచేసే అమెరికా పౌరులు ఎక్కువ వేతనం పొందుతుంటారు. వారికి గంటకు 20 నుంచి 30 డాలర్లు యజమానులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ, భారతీయ విద్యార్థులైతే గంటకు 6 నుంచి 10 డాలర్లు ఇచ్చినా పనిచేస్తుంటారు కాబట్టి వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల్లేకుండా చదువు కొనసాగిస్తున్నారు.

ప్రతి నెలా 50వేలకు పైనే ఖర్చు!

ట్రంప్ వచ్చింది మొదలు అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపారు. ఈ క్రమంలోనే అక్కడి అధికారులు వలసదారులను గుర్తించే పనిలో విస్తృతంగా తనిఖీలు కొనసాగిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా క్యాంపస్ బయట పార్ట్​టైం జాబ్ చేస్తూ పట్టుబడితే వీసా రద్దు చేసి స్వదేశానికి పంపించే ప్రమాదం ఉంది. ఇలా పట్టుబడితే జీవితంలో మరోసారి అమెరికా వెళ్లలేని పరిస్థితి వస్తుందని భయపడుతున్న విద్యార్థులు పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు మానేస్తున్నారు. నెలవారీ ఇంటి అద్దె, భోజనం తదితర ఖర్చులకు డబ్బు పంపించండి అంటూ తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి కోరుతున్నారు. ప్రాంతాలను బట్టి ప్రతి నెలా రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకు జీవన వ్యయం ఉంటుందని అంచనా.

ఏప్రిల్‌ తర్వాత సర్ధుకుంటుందా?

ప్రస్తుతం కొనసాగుతున్న అనిశ్చిత పరిస్థితి కొన్ని నెలల తర్వాత తొలగిపోవచ్చని భావిస్తున్నారు. ఉన్నట్టుండి విద్యార్థులంతా ఉద్యోగాలు మానేస్తే స్థానికంగా వ్యాపారాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. రెస్టారెంట్లు, హోటళ్లు, సూపర్ మార్కెట్లలో సిబ్బంది కొరత ఏర్పడి మూసేసే ప్రమాదాలు లేకపోలేదు. యజమానుల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చే అవకాశాలున్న నేపథ్యంలో ఎక్కువ రోజులు ఈ పరిస్థితి ఉండకపోవచ్చని అని వరల్డ్‌ వైడ్‌ ఎడ్యు కన్సల్టెంట్స్‌ ఎండీ వీఆర్‌ ఉడుముల పేర్కొన్నారు.

మనవాళ్లే, తెలుగువాళ్లే అధికం

అమెరికా ఇటీవల విడుదల చేసిన "ఓపెన్‌ డోర్‌" నివేదిక ప్రకారం 2023-24లో భారతీయ విద్యార్థులే అధికం. మొత్తం 11.26 లక్షల మంది విదేశీ విద్యార్థులు ఉండగా అందులో మనవాల్లు 3.30 లక్షల మంది కావడం గమనార్హం. దాదాపు ప్రతి 100 మంది విదేశీ విద్యార్థుల్లో 30 మంది మనవారే. అందులోనూ ఏపీ, తెలంగాణ విద్యార్థులు 56% మంది ఉన్నట్లు సమాచారం.

"ఎంఎస్‌ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నా. ట్రంప్‌ వచ్చాక ఉద్యోగాలు పెరుగుతాయని అనుకుంటే తీరా ఇప్పుడు పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు కూడా లేకుండా చేస్తున్నారు. కన్సల్టెన్సీలో ఉద్యోగం చేస్తున్నట్లు చూపించి వీసా గడువు పెంచుకుంటున్నా. ఇపుడు ఉద్యోగం, ఆదాయం లేక బంధువుల ఇంట్లో ఉంటున్నా" అని కాలిఫోర్నియాలో ఉంటున్న మియాపూర్‌కు చెందిన ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

దేశంలో రైల్వేలైన్ లేని రాష్ట్రం - అక్కడి ప్రజలు ఆదాయ పన్ను కూడా చెల్లించరట!

మీ హైట్ ఏంటి, వెయిట్ ఏంటి? - ఎవరెంత బరువుండాలో ఈ ఫార్ములాతో తెలుసుకోండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.