President Draupadi Murmu Comments on Polavaram Project: పోలవరం సత్వర నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలిరోజున ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో రాష్ట్రపతి పోలవరం ప్రాజెక్టును ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నామన్న ఆమె, ఇప్పటికే అదనపు నిధులను కేటాయించినట్టు వివరించారు. పోలవరం సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందని అందుకోసం రూ.12 వేల కోట్లు కేటాయించిందని అన్నారు.
గుడ్న్యూస్ - త్వరలో 16,347 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్: సీఎం చంద్రబాబు
అరకులో ప్రారంభమైన వింటర్ ఫెస్ట్ - ప్రత్యేక ఆకర్షణగా పారా గ్లైడింగ్