ETV Bharat / sports

'టీమ్ఇండియా ప్లేయర్స్​తో ఫ్రెండ్లీగా ఉండొద్దు! - వాళ్లు అలా చేసే ఛాన్స్ ఉంది : పాక్‌ క్రికెటర్లకు మాజీ కెప్టెన్ వార్నింగ్ - IND VS PAK CHAMPIONS TROPHY 2025

పాక్ ప్లేయర్లకు మాజీ క్రికెటర్ హెచ్చరిక - టీమ్​ఇండియాకు దూరంగా ఉండమని రిక్వెస్ట్​ - ఎందుకంటే?

IND vs PAK Champions Trophy 2025
IND vs PAK Champions Trophy 2025 (Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : Jan 31, 2025, 2:55 PM IST

IND vs PAK Champions Trophy 2025 : ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం అగ్ర టీమ్స్​ అన్నీ సంసిద్ధమవుతున్న తరుణంలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మొయిన్‌ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు వ్యాఖ్యానించారు. తమ ప్లేయర్లను భారత క్రికెటర్లతో స్నేహం చేయొద్దని ఆయన హెచ్చరించారు. ఎందుకంటే?

'అందుకే అలా వార్నింగ్ ఇచ్చా'
అయితే ఈ క్రికెటర్ వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర దుమారం రేపుతోంది. కానీ ఆయన అనడానికి వెనక కారణం ఉందని తాజాగా మొయిన్‌ స్పష్టం చేశారు. తనకు ప్లేయర్లపై ఎటువంటి అగౌరవం లేదని తెలిపిన ఆయన, మైదానంలో వారితో స్నేహపూర్వకంగా ఉండటం సరైంది కాదన్నదే తన అభిప్రాయమని పేర్కొన్నారు. మైదానంలో పోటీతత్వం ఉంటేనే గెలవాలన్న పట్టుదల వస్తుందని పేర్కొన్నారు. గౌరవించడం మంచిదే కానీ, ప్రొఫెషనలిజానికి ఉన్న లిమిట్స్​ను క్రాస్​ చేయకూడదని ఆయన హెచ్చరించాడు.

"రీసెంట్​గా భారత్-పాకిస్థాన్‌ మ్యాచ్‌లను చూస్తుంటే నాకు ఓ విషయం అర్థం కావట్లేదు. టీమ్‌ఇండియా క్రికెటర్లు క్రీజ్‌లోకి వచ్చినప్పుడల్లా మా ఆటగాళ్లు వెళ్లి వారి బ్యాట్లను చెక్‌ చేయడం వారి భుజాలను తట్టడం, వారితో స్నేహంగా మాట్లాడటం వంటివి చేస్తున్నారు. వారందరూ అలా ఎందుకు చేస్తున్నారో నాకు అస్సలు తెలియట్లేదు. ఇక్కడ నేను అపోనెంట్​ ప్లేయర్​ను గౌరవించద్దని చెప్పట్లేదు. గతంలో మా సీనియర్లు ఒకటే మాట అనేవారు. భారత్‌తో క్రీజులోకి దిగినప్పుడు ఎటువంటి మినహాయింపులు ఇవ్వకూడదని అంటారు. మైదానంలో వారితో కనీసం మాట్లాడటం కూడా చేయొద్దని సూచించేవారు. ఎప్పుడైతే మనం వారితో ఫ్రెండ్లీగా ఉంటామో అప్పుడు వారు అది మన బలహీనత అని అనుకునే ప్రమాదం లేకపోలేదు" అని మొయిన్‌ వ్యాఖ్యానించాడు.

రోహిత్ శర్మ పాక్‌ వెళ్తాడా?
లాహోర్‌లో జరిగే ఈవెంట్‌లకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ హాజరవుతాడా లేదా అనేదానిపై స్పష్టత లేదు. అటు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డుగానీ, ఐసీసీగానీ ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. పైగా హైబ్రిడ్ మోడల్ ఒప్పందంలో భాగంగా భారత్ తన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది. ఈ అంశంపై బీసీసీఐ కూడా ఇంకా స్పందించలేదు.

'కెప్టెన్​గా కూల్​,​ ఫ్యాన్​గా హాట్​హాట్'- ఛాంపియన్స్ ట్రోఫీ ప్రోమో వైరల్​

ఛాంపియ‌న్స్ ట్రోఫీ విన్నర్స్​కు వైట్ సూట్స్​ ఎందుకు ఇస్తారో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.